
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించి 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. రేపు వెల్లింగ్టన్ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. ఇప్పుడందరూ ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యంలో ఉన్న భారత్.. రెండో మ్యాచ్‌లో కూడా గెలవాలని పట్టుదలతో ఉంది.
మరోవైపు సొంతగడ్డపై ఆడుతున్న న్యూజిలాండ్ జట్టు తొలి ఓటమి తర్వాత ఎలాగైనా పుంజుకోవాలని భావిస్తోంది. భారత్‌తో మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్ విభాగంలో పూర్తిగా విఫలమైన కివీస్.. ఈ సారి తమ లోపాలను సరిదిద్దుకుని గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది.
అయితే రెండో వన్డే మ్యాచ్ ఎక్కడ చూడాలి. ఎన్ని గంటలకు మ్యాచ్ జరుగుతుంది. ఏ స్టేడియంలో జరుగుతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
భారత్‌తో రెండో వన్డే మ్యాచ్ న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్లో ఉన్న హెన్రీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టాస్ ఉదయం 7 గంటలకు వేయనుండగా.. 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను టీవీలో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెల్లో చూడొచ్చు. అలాగే మొబైల్లో సోనీ లివ్ యాప్, వెబ్ సైట్లో లైవ్‌లో వీక్షించొచ్చు.
Also Read : దీపావళి బెస్ట్ గిఫ్ట్స్.. రూ.1000 లోపే కొనేయొచ్చు మావా..!
Auckland ✅
Hello from Wellington as the focus shifts to the 2️⃣nd ODI 👋
#TeamIndia | #NZvIND https://t.co/3VkE8rikR8
— BCCI (@BCCI) November 5, 2026
భారత్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కె.ఎల్. రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, అంశుల్ కంబోజ్, ఆకిబ్ నబీ/మహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్.
కివీస్ జట్టు: టీమ్ సీఫెర్ట్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జేమీసన్, జాకబ్ డఫీ/మ్యాట్ హెన్రీ, బ్లేర్ టిక్నర్.
Also Read : అరెస్టులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. అప్పటి నుంచే 24 గంటల టైం!









