
Karnataka : కర్ణాటకలోని చిక్కబల్లాపూర్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది. సివిల్ జడ్జి, జేఎంఎఫ్సీ కోర్టులో న్యాయమూర్తి కుర్చీపై క్షుద్రపూజలు చేసినందుకు గానూ 65 ఏళ్ల మంజుల అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
ఇంతకు ఏం జరిగిందంటే.. నిందితురాలు మంజుల కోర్టు గదిలోకి ప్రవేశించి, న్యాయమూర్తి కుర్చీపై క్షుద్రపూజల్లో భాగంగా మంత్రించిన తెల్ల ఆవాలను చల్లినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సిసిటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ దృశ్యాలను చూసిన కోర్టు సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read : అత్యాచారానికి వెల కట్టిన గ్రామ పెద్దలు.. నిందితుడి జరిమానాతో ఫుల్ దావత్!
#WATCH | Karnataka | Chikkaballapur City Police arrest a 65-year-old woman, identified as Manjula, for allegedly performing black magic on the chair of the 1st Additional Senior Civil Judge and JMFC Court in Chikkaballapur.
CCTV footage captured the woman allegedly sprinkling… pic.twitter.com/7urZKOb7wa
— ANI (@ANI) July 14, 2026
Also Read : హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు బిగ్ షాక్.. భారీగా లేఆఫ్‌లు!
కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నేత్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రివెన్షన్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ ఇన్ హ్యూమన్ ఈవిల్ ప్రాక్టీసెస్ అండ్ బ్లాక్ మ్యాజిక్ యాక్ట్, 2017 కింద మంజులపై కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.









