yadav

Akhilesh Yadav : సోషల్ మీడియాలో ఓ వీడియో ఇప్పుడు విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ముందే ఒక కార్యకర్త చకచకా పుష్-అప్స్ తీయడం, అది చూసి అఖిలేష్ నవ్వుతూ అతడిని ఆపి, చేతులు కలపడం ఆ వీడియోలో కనిపిస్తుంది. లక్షల మంది చూసిన ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ చాలా తక్కువ మందికే తెలుసు.

ఈ వీడియోలో కనిపిస్తున్న కార్యకర్త పేరు సీతారాం యాదవ్ అలియాస్ కన్హయ్య. ఝాన్సీకి చెందిన కన్హయ్య మూడేళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు ఆయన వ్యవసాయం చేసుకునేవారు. తన తల్లి ఇచ్చిన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని, ములాయం సింగ్ యాదవ్ సిద్ధాంతాలు, ఆయన సాదాసీదా జీవితం తనను ఎంతగానో ఆకర్షించాయని కన్హయ్య చెబుతుంటారు. అందుకే తాను సమాజ్‌వాదీ పార్టీకి నమ్మకమైన కార్యకర్తగా మారానని అంటారు.

అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పటిది కాదు, కొన్ని నెలల క్రితం నాటి ముచ్చట. 2026 జనవరిలో కన్హయ్య తన కూతురి పెళ్లి పత్రిక ఇవ్వడానికి లక్నో వెళ్లి అఖిలేష్ యాదవ్‌ను కలిశారు. ఆ సమయంలో అఖిలేష్‌కు దాదాపు 38 కిలోల బరువున్న ఇత్తడి ములాయం సింగ్ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈరోజు నేతాజీ బతికి ఉంటే ఆయన కాళ్లపై పడి నమస్కరించేవాడిని అని కన్హయ్య అనగా.. అఖిలేష్ నవ్వుతూ మీరు కుస్తీ (పహిల్వాన్‌) కూడా చేస్తారా? అని అడిగారు. దానికి కన్హయ్య.. “అవును, నేను పహిల్వాన్‌ని, మన నేతాజీ కూడా కుస్తీ నేపధ్యం ఉన్నవారే కదా” అంటూ అక్కడికక్కడే ఆ విగ్రహం ముందే పుష్-అప్స్ కొట్టడం మొదలుపెట్టారు. ఆ క్షణంలో తీసిన వీడియోనే ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.

Also Read : రాముడి డబ్బులతో జల్సాలు… తమ్ముడి పెళ్లికి లక్షలు!

ఆ తర్వాత ఫిబ్రవరి 2026లో అఖిలేష్ యాదవ్ స్వయంగా ఝాన్సీకి వెళ్లి కన్హయ్య కూతురి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, జూలై 1న అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా కన్హయ్య మరోసారి లక్నో వెళ్లారు. ఈసారి ఆయన సైకిల్ తొక్కుతున్న అఖిలేష్ యాదవ్ ఉన్న 58 కిలోల బరువైన ఇత్తడి విగ్రహాన్ని గిఫ్ట్‌గా తీసుకెళ్లారు. ఆ విగ్రహాన్ని చూసి అఖిలేష్ ఎంతో సంతోషపడి, కన్హయ్యను ప్రేమగా పలకరించారు. ఈ తాజా భేటీ తర్వాతే, పాత పుష్-అప్స్ వీడియో సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Also Read : ఒక సినిమా.. మూడు పేర్లు.. నాలుగేళ్ల సెన్సార్ యుద్ధం: ఓటీటీలోకి వచ్చిన 48 గంటల్లోనే మాయం.. అసలేం జరిగింది?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.