Vivo X300 E Launched
Vivo X300 E Launched

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో మరో కొత్త ఫోన్‌ Vivo X300 Eను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సరికొత్త క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, 7,200mAh భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన AMOLED డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6 ఉన్నాయి. దీంతోపాటు మరెన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు దీని ధర, ఇతర స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.

Also Read : లీకేజీల నిరోధక చట్టాలు.. యూపీ, బీహార్ నుంచి రాజస్థాన్ వరకు… ఏ రాష్ట్రంలో ఎలాంటి చట్టం ఉందో తెలుసా?

Vivo X300 E Price

Vivo X300 E ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 12GB RAM + 256GB స్టోరేజ్‌ వేరియంట్ ధర సుమారుగా రూ. 68,000 నుండి ప్రారంభమవుతుంది. అలాగే 12GB + 512GB వేరియంట్ ధర రూ. 75,000గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 31 నుండి వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

Also Read : విజయ్ బాటలో మరో స్టార్… రాజకీయాల్లోకి ధనుష్?

Vivo X300 E Specs

Vivo X300 E లో 1260×2750 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన 6.59-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. Vivo X300 E ఫోన్‌లో 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్‌ ఫీచర్‌ కూడా ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6 పై పనిచేస్తుంది.

ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. Vivo X300 Eలో జైస్-ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ అందించారు. ఇందులో OIS తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. Vivo X300 E ఫోన్‌లో 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 7,200mAh బ్యాటరీ అందించారు.