
Tarun Tejpal : 2013 నాటి అత్యాచారం కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు పదేళ్ల పాటు శిక్షపడింది. అంతేకాకుండా కోర్టు అతనికి రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. రెండు వారాల్లో లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2013లో గోవాలో జరిగిన థింక్‌ఫెస్ట్ కార్యక్రమంలో, ఒక హోటల్ ఎలివేటర్లో తన జూనియర్ సహోద్యోగిపై తేజ్‌పాల్ లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణల ఘటన జరిగిన దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ తీర్పు వెలువడింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు గత వారం తన తీర్పును రిజర్వ్ చేసింది. కాగా ఇందులో తేజ్ పాల్ ను దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు తాజాగా శిక్షను విధించింది.
Also Read : ఢిల్లీ నుంచి రాంచీకి పాకిన జెన్ జీ.. జార్ఖండ్‌లో అసలు ఏం జరుగుతోంది?
తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ముందుగా కేసు పెట్టగా.. అదే ఏడాది నవంబర్ లో పోలీసులు తరుణ్ తేజ్‌పాల్ ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత కొంతకాలానికి బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. ఈ కేసుపై 2017లో మాపులా ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభం కాగా.. తేజ్పాల్ను నిర్దోషిగా తేలుస్తూ 2021 మేలో సెషన్స్ కోర్టు తేజ్పాల్ను అన్ని ఆరోపణల నుండి నిర్దోషిగా ప్రకటించింది. అయితే గోవా ప్రభుత్వం ఆ తీర్పును సవాలు చేసింది. ఈ అప్పీల్‌ను బాంబే హైకోర్టు గోవా బెంచ్‌కు చెందిన జస్టిస్‌లు డాక్టర్ నీలా గోఖలే, అమిత్ జమ్సందేకర్ విచారించారు. తీర్పు వెలువడే సమయంలో తేజ్‌పాల్ తప్పనిసరిగా హాజరు కావాలని వారు ఆదేశించారు.
ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదలను వినిపించారు. వాదోపవాదనలు విన్న తరువాత కోర్టు తరుణ్ తేజ్‌పాల్ ను దోషిగా తేల్చుతూ శిక్షను ఖరారు చేసింది. తీర్పు అనంతరం తుషార్ మెహతామాట్లాడుతూ.. తేజ్పాల్ను తక్షణమే అరెస్టు చేయాలన్నారు. బాధితురాలికి తండ్రి వయసులో ఉన్న అతను ఈ నేరానికి పాల్పడ్డాడని తెలిపారు. ఒక అమ్మాయి వద్దంటే.. దాని అర్థం వద్దనే. దీనిపై ఈ కోర్టు సమాజానికి గట్టి సందేశం ఇవ్వాలని మెహతా పేర్కొన్నారు. బాధితురాలు కేవలం సహోద్యోగి మాత్రమే కాదని, అతని కుమార్తెకు స్నేహితురాలు కూడా. నిందితుడు ఏమాత్రం పశ్చాత్తాపం చూపలేదు అని మెహతా అన్నారు.
కోర్టులో హాజరైన తేజ్‌పాల్, తాను రాజకీయ బాధితుడిని అని, ఇద్దరు కుమార్తెల తండ్రినని పేర్కొంటూ, కనికరం చూపాలని కోరారు. అయితే ఆయన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తానని తేజ్‌పాల్ తెలిపారు.
Also Read : 21 ఏళ్ల కాపురం, ఐదుగురు పిల్లలు! కట్ చేస్తే.. భార్యను ప్రేమికుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త!









