
Abhijeet Dipke : నీట్ పేపర్ లీక్ విషయంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించిన ఆందోళన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మంత్రి రాజీనామాతో వివాదం కొంత సద్దుమణిగినప్పటికీ విద్యార్థులపై కేసుల ఉపసంహరణ విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొంది. కాగా, ఈ ఆందోళనతో CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే దేశవ్యాప్తంగా ఫేమ్ లోకి వచ్చాడు. అయితే ఆయనకు బెదిరింపులు రావడంతో ప్రభుత్వం ఆయన ఇంటివద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆయనకు భద్రత కలిపించే ఉద్ధేశంతో ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బంది ఆయనను కలిసేందుకు వచ్చేవారిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ అభిజిత్ దీప్కే తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సబ్ ఇన్ స్పెక్టర్‌ను తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read : పాక్ దొంగ బుద్ధి.. భారత్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ కు వలపు వల.. మహిళతో వీడియో కాల్స్ చేయించి.. !
Chhatrapati Sambhajinagar – Abhijit Dipke has made strong allegations against CID officers, accusing them of arrogant and rude behaviour towards people who come to meet him.Dipke, who flared up against the police officers, claimed that visitors arriving for meetings with him are… pic.twitter.com/5hCF6s7p8Y
— NextMinute News (@nextminutenews7) August 7, 2026
ఛత్రపతి శంభాజీనగర్‌లోని వాలుజ్ ఎంఐడీసీ ప్రాంతంలో దీప్కే నివాసం ఉంది. ఆందోళనల నేపథ్యంలో ఆయనను కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. దీంతో ఆయన ఇంటివద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. వారిలో ఒక పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్‌ను కూడానియమించారు. అయితే ఆ అధికారి తన ఇంటికి వచ్చే వారిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ దీప్కే ఆయనపై ఫైర్ అయ్యారు.
Also Read : ఫార్చ్యూన్ నూనె వాడుతున్నారా?.. FSSAI పరీక్షల్లో షాకింగ్ నిజాలు!
దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో.. సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసు అధికారితో దీప్కే వాగ్వాదం చేస్తు్న్నట్లు కనిపిస్తుంది. తన ఇంటికి ఎవరు రావాలి.. ఎవరిని కలవాలి అనే విషయాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అందులో ఉంది. “నా ఇంట్లో మీ పెత్తన ఏంటి?. నేను ఎవరినైనా ఇంట్లోకి రావాలని చెబుతున్నప్పుడు.. వారిని ఎందుకు ఆపుతున్నారు? అంటూ ఆయన ఆ అధికారిపై మండి పడ్దారు. అంతేకాక మీరు ఢిల్లీ పోలీసుల్లా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇప్పటివరకు ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. ఎవరిని కలవాలి.. ఎవరిని కలవకూడదో పోలీసులు నాకు చెప్పలేరు” అంటూ దీప్కే ఆయనను ప్రశ్నించారు. దానితో ఆగకుండా “మీరు బయటకు వెళ్లండి. నాకు మీ అవసరం లేదు” అంటూ ఆ పోలీసు అధికారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.
అదే కాక మరో వీడియోలో దీప్కే ఓ పోలీసు ఉన్నతాధికారితో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లుంది. సురేశ్ అనే పీఎస్‌ఐ తనను కలిసేందుకు వచ్చే వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. వారిని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారని, అలాంటి అధికారి తనకు వద్దని స్పష్టం చేశారు. అతన్ని వెంటనే అక్కడి నుంచి తొలగించాలని కోరారు. “నా ఇంటికి వచ్చే వారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది కావాలనే చేస్తున్నారా?” అంటూ ఆయన ప్రశ్నిస్తు్న్న వీడియో వైరల్‌గా మారింది.
అంతేకాక, తన ఇంటి సమీపంలో సీఐడీ సిబ్బందిని సివిల్ దుస్తుల్లో నిఘా పెట్టారని కూడా దీప్కే ఆరోపిస్తున్నారు. ఓ జర్నలిస్ట్ తనకు ఈ విషయం తెలిపారని చెప్పారు. ఓ సీఐడీ సిబ్బంది ఫోన్‌లో ‘హిట్ స్ప్రే’ పేరుతో వాట్సాప్ గ్రూప్ కూడా కనిపించిందని, అక్కడి నుంచి నివేదికలు పంపిస్తున్నారని దీప్కే ఆరోపించారు. అయితే దీప్కే చేసిన ఆరోపణలపై పోలీసుల నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. .









