Samsung Galaxy F70 Pro 5G
Samsung Galaxy F70 Pro 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన శాంసంగ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ Samsung Galaxy F70 Pro 5Gను రేపు (ఆగస్టు 3) భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్‌లో AMOLED డిస్‌ప్లే, 6,000 mAh బ్యాటరీ, 4K వరకు వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఇప్పుడు ఈ Samsung Galaxy F70 Pro 5G ఫోన్‌ ధర, వేరియంట్లు, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Samsung Galaxy F70 Pro 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 6 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 25,999, 8 GB + 128 GB వేరియంట్ ధర రూ.29,999, 8 GB + 256 GB వేరియంట్ ధర రూ. 34,999గా ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల సందర్భంగా కొన్ని ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. Samsung Galaxy F70 Pro 5Gని కంపెనీ ఇ-స్టోర్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుక్కోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ గ్రీన్, బ్లాక్ కలర్‌లతో సహా మూడు కలర్‌లలో అందుబాటులోకి వచ్చాయి.

Samsung Galaxy F70 Pro 5Gలో120 Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఫ్లాట్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. అలాగే స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ అందించారు. శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి.

Samsung Galaxy F70 Pro 5G స్మార్ట్‌ఫోన్ వెనుక కెమెరా యూనిట్‌కు LED ఫ్లాష్ అందించారు. ముందు కెమెరాలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం HDR కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4K వరకు వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5Gలో 6,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 24 గంటలకు పైగా యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్, ఎనిమిది గంటలకు పైగా గేమింగ్, 12 గంటల వరకు సోషల్ మీడియా స్క్రోలింగ్‌కు సరిపోతుందని కంపెనీ పేర్కొంది.