
Cockroach Janata Party (CJP): ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలపై ఆందోళనకు పిలుపునివ్వడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయా లేవా అని తెలుసుకునేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కి సభ్యులకు చేదు అనుభవం ఎదురైంది. ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా సీజేపీ కో-కన్వీర్ అశుతోష్ రంకా ఆధ్వర్యంలో కొంతమంది కార్యకర్తలు శుక్రవారం రాజస్థాన్‌లో పర్యటించారు. రాజస్థాన్‌లోని జైపుర్ జిల్లా రాంపురా కన్వర్పురా గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సీజేపీ బృందం పై దాడికి పాల్పడ్డారు. వారిపై రాళ్లతో దాడి చేసి, తీవ్రంగా కొట్టి గాయపరిచడమే కాకుండా కార్లను? ఫోన్లను ధ్వంసం చేశారు. కాగా వారిపై దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

VIDEO | Jaipur, Rajasthan: Cockroach Janata Party (CJP) co-convenor Ashutosh Ranka and others chased away by locals as they tried to visit Bagru village. #CJP #JaipurNews
(Full video available to PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/ZivHSEFqaO
— Press Trust of India (@PTI_News) August 21, 2026
కొంతమంది గ్రామస్థుల విజ్ఞప్తి మేరకే రాంపురా కన్వర్‌పురాకు అశుతోశ్ రాంకా తన బృందం వెళ్లినట్లు తెలుస్తోంది. గ్రామం బయట వారి వాహనాలు నిలిపి కాలినడకన వారు గ్రామంలోకి ప్రవేశిస్తుండగా అప్పటికే అక్కడ వేచి ఉన్న కొంతమంది వ్యక్తులు వారిని అడ్డుకోవడం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా సీజేపీకి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సేజేపీ బృందాన్ని అర్బన్ నక్సల్స్, దేశద్రోహులు, పాకిస్థానీలంటూ వారు దూషిస్తూ దాడికి దిగారు. అయితే, సీజేపీ బృందంలోని కొంతమంది మహిళలు వారిని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వెనుకకు తగ్గకపోగా ఆగ్రహంతో ఊగిపోయిన ఆ గుంపు.. కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. గ్రామంలోకి ప్రవేశించకుండా వారి వెంటపడి మరీ తరిమికొట్టారు. రాళ్లు సైతం విసిరి తీవ్రంగా గాయపరిచారు.

Requesting media to not blame the villagers for today’s incident. People were sent from outside to incite violence. It was the villagers who had requested us to come and inspect the school.
I have been told that the local BJP counsellor was seen distributing money to some goons.
— Ashutosh Ranka (@AshutoshRanka) August 21, 2026
ఈ ఘటనపై స్పందించిన అ సీజేపీ సహ వ్యవస్థాపకుడు అశుతోశ్ రాంకా మాట్లాడుతూ ఈ దాడికి బీజేపీయే కారణమని ఆరోపించారు. గోశాలలో పాఠశాలను నిర్వహిస్తున్నారని, తమ గ్రామానికి వచ్చి చూడాలని తమను స్థానికుల ఆహ్వానించారని, ఆ మేరకే తాము వచ్చామని రాంకా వివరించారు. ‘చాలా సంవత్సరాలుగా పాఠశాల ఓ గోశాలలో నడుస్తోంది. గతేడాదీ కూడా మేము ఇదే పాఠశాలను సందర్శించాం. ఈ రోజు పర్యటన గురించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాం. కానీ బీజేపీ గూండాలు అప్పటికే అక్కడ వేచి ఉన్నారు. మా వాలంటీర్లపై దాడి చేశారు. మా కార్లు, ఫోన్లను ధ్వంసం చేశారు. ఓ మహిళపైనా కూడా దాడి చేశారు. నా చొక్కాను చింపేశారు. మా బృంద సభ్యుల్లో ఒకరి చేయి విరిగింది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
VIDEO | Jaipur, Rajasthan: Cockroach Janata Party (CJP) co-convenor Ashutosh Ranka says, “We had gone to inspect the school in Rampura-Kanwarpura village. For the past several years, the school has been operating in a buffalo shed. We had gone for an inspection last year as well,… https://t.co/MqgiMSCt8R pic.twitter.com/pWxyPwsyyW
— Press Trust of India (@PTI_News) August 21, 2026
దీనిపై స్పందించిన సీజేపీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే.. రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తమ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారని, వాహనాలపై ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అక్కడకు రాలేదని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. తమ బృందంపై దాడి బీజేపీ పనేనని మండిపడ్డారు. ఈ ఘటనలో తమ వాళ్లు గాయపడ్డారని తెలిపారు. రాజస్థాన్‌లో గూండాల పాలన నడుస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Ashu has been attacked by BJP goons in Rajasthan.
Ashu and other volunteers of CJP were beaten up and have been injured.@PoliceRajasthan has allowed this to happen. pic.twitter.com/pc7c3GCAfV
— Abhijeet Dipke (@abhijeet_dipke) August 21, 2026
కాగా, సీజేపీ బృందంపై జరిగిన దాడి రాజస్థాన్ అసెంబ్లీలోనూ తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటసారా ఈ దాడికి బీజేపీయే కారణమని ఆరోపించారు.. రాజస్థాన్ హోంమంత్రి జవహర్ సింగ్ బేదం మాత్రం సీజేపీ ముసుగులో కాంగ్రెస్ పార్టీయే గొడవ సృష్టిస్తోందని అన్నారు.









