Indian Railways : రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్‌ఏసీ టికెట్ల విధానాన్ని రద్దు చేసే ఆలోచనలో రైల్వే శాఖ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆర్‌ఏసీ విధానంలో ఇద్దరు ప్రయాణికులకు ఒకే బెర్త్ కేటాయిస్తారు. అంటే ఒక బెర్త్‌పై ఇద్దరు కూర్చోవాల్సి ఉంటుంది. కానీ ఇద్దరి దగ్గరా పూర్తి టికెట్ ధరనే రైల్వే శాఖ వసూలు చేస్తుంది. దీంతో సగం బెర్త్ మాత్రమే పొందుతున్నప్పుడు పూర్తి డబ్బులు ఎందుకు చెల్లించాలనే ప్రశ్నలు ప్రయాణికుల నుంచి వస్తున్నాయి.

ఈ విషయంపై రైల్వే శాఖ అధికారులు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుడికి పూర్తిగా పడుకునే సౌకర్యం కల్పించనప్పుడు పూర్తి టికెట్ ధర వసూలు చేయడం సరైనది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్‌ఏసీ విధానాన్ని కొనసాగించాలా? వద్దా? అనే విషయాన్ని రైల్వే శాఖ పరిశీలిస్తోంది.

Also Read : TVS నుంచి ఊరమాస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఫుల్ మైలేజీ..!

అంతేకాదు.. ఒకే బెర్త్‌ను ఒక పురుషుడికి, ఒక మహిళకు కేటాయించినప్పుడు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయాల్లో వారికి వేరే సీట్లు ఏర్పాటు చేయడం టికెట్ తనిఖీ చేసే సిబ్బందికి కష్టంగా మారుతోంది. ఆర్‌ఏసీ టికెట్ ఉన్న ప్రయాణికుల నుంచి పూర్తి డబ్బులు వసూలు చేయడంపై పార్లమెంటరీ కమిటీ కూడా గతంలో ప్రశ్నించింది. సగం బెర్త్ మాత్రమే ఇచ్చి పూర్తి ధర తీసుకోవడం ఎందుకని రైల్వే శాఖను ప్రశ్నించింది. ఈ విధానాన్ని మరోసారి పరిశీలించి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించింది.

గతంలో రైల్వే టికెట్ల రిజర్వేషన్ అంతా చేతితోనే నిర్వహించే రోజుల్లో ఆర్‌ఏసీ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో ఎవరైనా టికెట్ రద్దు చేసుకుంటే ఆ ఖాళీ బెర్త్‌ను వెంటనే గుర్తించే సదుపాయం ఉండేది కాదు. అందుకే ఒకే బెర్త్‌ను ఇద్దరికి కేటాయించేవారు. వారిలో ఒకరు టికెట్ రద్దు చేసుకుంటే, మరొకరికి పూర్తి బెర్త్ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు రైల్వేలో రిజర్వేషన్ విధానం పూర్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్‌ఏసీ విధానం అవసరమా? అనే విషయంపై రైల్వే శాఖ ఆలోచన చేస్తోంది.

Also Read : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై ఆల్ ఇన్ వన్ యాప్‌గా మారనున్న చాటింగ్ యాప్.. ఎలాగంటే?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.