
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెరిగిన ఇంధన ధరలు ఈరోజు నుంచే అమలులోకి రానున్నాయి. వాహనదారులకు కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఇలా ధరలు పెరగడం ఇది మూడోసారి కావడంతో సామాన్యులపై అదనపు భారం పడనుంది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.84కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.100.94గా ఉంది.









