
అయోధ్య రామ మందిర ట్రస్ట్ సీఈఓ పోస్టు కోసం దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. ఈ పదవికి ఇప్పటికే వెయ్యికి పైగా దరఖాస్తులు అందగా, అందులో ఎక్కువమంది రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, మాజీ ఐపీఎస్ అధికారులు ఉండటం గమనార్హం. మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ కూడా ఈ రేసులో ఉన్నారు.
సీఈఓని ఎంపిక చేసేందుకు ట్రస్ట్ ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ జనరల్ విశ్వకాంత్ చతుర్వేది, శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ సురేష్ హవారే సభ్యులుగా ఉన్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జూలై 18. జూలై 19న కమిటీ సమావేశమై దరఖాస్తులను పరిశీలించి, ఇంటర్వ్యూల ప్రక్రియను ఖరారు చేస్తుంది. జూలై 22న జరగబోయే ట్రస్ట్ సమావేశంలో ఎంపిక ప్రక్రియ పురోగతిపై కమిటీ నివేదిక సమర్పించనుంది.
Also Read : భార్య అక్రమ సంబంధం: రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. వైరల్ వీడియో!
ఈ పదవికి దరఖాస్తు చేసేవారు 50 నుండి 70 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. కనీసం 20 ఏళ్ల పరిపాలనా అనుభవం ఉండటంతో పాటు, అయోధ్యలోనే నివసించేందుకు సిద్ధంగా ఉండాలి. వీరు భక్తిగల హిందువులై ఉండటమే కాకుండా, శ్రీరామునిపై విశ్వాసం కలిగి, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉండటం తప్పనిసరి.
దరఖాస్తుల సంఖ్య భారీగా ఉండటంతో, అభ్యర్థుల అర్హతలను పరిశీలించడానికి కమిటీకి సహాయంగా ఒక కార్యదర్శిని కూడా నియమించనున్నారు. ప్రాథమిక పరిశీలన తర్వాత షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు, అవసరమైతే ఆన్‌లైన్‌లో కూడా ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉంది. రామ మందిర విరాళాల చోరీ వివాదం నేపథ్యంలో, ఈ కీలకమైన సీఈఓ పోస్టు కోసం మాజీ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Also Read : గుడ్‌న్యూస్: త్వరలోనే 10 కేజీల కమర్షియల్ సిలిండర్.. ధర ఎంతంటే?









