Oppo Reno 16 Series
Oppo Reno 16 Series

Oppo తన కొత్త Oppo Reno 16 Seriesను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో కంపెనీ Oppo Reno 16, Oppo Reno 16c స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16 పై పనిచేస్తాయి. వీటిలో 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP సెల్ఫీ కెమెరా, AI ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు మొబైల్స్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ అందించే IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లతో వస్తాయి.

Oppo Reno 16 – 8GB + 256GB వేరియంట్ ధర రూ.61,999.
Oppo Reno 16 – 12GB + 256GB వేరియంట్ ధర రూ.67,999.
Oppo Reno 16c – 8GB + 128GB వేరియంట్ ధర రూ.46,999. Oppo Reno 16c – 8GB + 256GB వేరియంట్ ధర రూ.49,999. Oppo Reno 16c – 12GB + 256GB వేరియంట్ ధర రూ.55,999గా ఉంది.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు జూలై 9 నుండి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇ-స్టోర్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉండనున్నాయి. ఇవి స్టారీ వైట్, స్టెల్లార్ పర్పుల్, ట్వైలైట్ వైలెట్ కలర్‌లలో లభిస్తాయి. ప్రారంభ ఆఫర్లలో భాగంగా.. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, UPI లావాదేవీలపై 10% వరకు క్యాష్‌బ్యాక్, 18 నెలల వరకు జీరో-డౌన్ పేమెంట్ EMI, రూ.5,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, 180 రోజుల స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఉన్నాయి. అదనంగా Oppo Reno 16 series కొనుగోళ్లపై OPPO ఎంకో బడ్స్ 3 ప్రో+ పై 50% వరకు తగ్గింపు కూడా లభిస్తుంది.

Oppo Reno 16 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మరోవైపు Oppo Reno 16c మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. రెనో 16లో 6.32-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉండగా, రెనో 16cలో 6.57-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తాయి. రెనో 16లో గరిష్ట బ్రైట్‌నెస్ 1,800 నిట్స్ కాగా, రెనో 16cలో 1,400 నిట్స్ ఉంది.

Oppo Reno 16లో OIS సపోర్ట్‌తో కూడిన 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. మరోవైపు Oppo Reno 16cలో అవే ప్రైమరీ, టెలిఫోటో కెమెరాలతో పాటు అదనంగా 8MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా అమర్చారు.

ఈ రెండు ఫోన్‌లలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి. ఒప్పో రెనో 16లో 6,700mAh బ్యాటరీ ఉంది. అదే సమయంలో రెనో 16సిలో 7,000mAh బ్యాటరీ ఉంది. ఈ రెండు ఫోన్‌లు 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.