ప్రతి నెలా లాగే అక్టోబర్ నెలలో కూడా ఆర్థిక లావాదేవీలపై కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ ఇ-కేవైసీ, గ్యాస్ ధరలు, యూపీఐ ఛార్జీలు, బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

Also Read : షాహి మ‌సీదు తొల‌గింపు.. ఉజ్జయిని ఉద్రిక్తం..రాళ్లు రువ్విన ఆందోళనకారులు

గ్యాస్ కనెక్షన్‌కు ఇ-కేవైసీ

గ్యాస్ వినియోగదారులు తమ ఆధార్ బయోమెట్రిక్ ఇ-కేవైసీ ప్రక్రియను సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం తెలిపింది. దొంగ కనెక్షన్లను అడ్డుకోవడంతో పాటు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సరైన వారికే అందాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 30 నాటికి ఇ-కేవైసీ పూర్తి చేయకపోతే అక్టోబర్ నుంచి వచ్చే గ్యాస్ సబ్సిడీ ఆగిపోయే అవకాశం ఉంది. అయితే గ్యాస్ ఏజెన్సీలు, డీలర్ల వద్దకు వెళ్లి లేదా ఆయిల్ కంపెనీల అధికారిక యాప్‌ల ద్వారా ఉచితంగా ఇ-కేవైసీ చేసుకోవచ్చు.

గ్యాస్ సిలిండర్ ధరల మార్పులు

ప్రతి నెలా మొదటి తేదీన అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు సవరిస్తుంటాయి. సెప్టెంబర్‌లో ఇంటికి వాడే గ్యాస్ సిలిండర్ ధరను మార్చకపోయినా, కమర్షియల్ సిలిండర్ ధరను రూ.10 పెంచారు. గ్లోబల్ మార్కెట్‌లో జరుగుతున్న మార్పుల వల్ల అక్టోబర్ 1న గృహ, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు

మనమందరం రోజూ వాడే డిజిటల్ చెల్లింపులపై అక్టోబర్ 15 నుంచి కొన్ని కొత్త మర్చంట్ ఛార్జీలు రాబోతున్నాయి. రూ.2 వేల కంటే ఎక్కువ విలువైన లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ పడుతుంది. సాధారణంగా మనం ఒకరికొకరు చేసుకునే పేమెంట్లు, అలాగే చిన్న చిన్న షాపుల వ్యాపారులకు చేసే చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. పెట్రోల్ పంపులు, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల వంటి వాటికి మాత్రం ఒకే రకమైన రూ.5 రుసుము వర్తిస్తుంది.

Also Read : జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370 వివాదం .. తీర్మానం ప్రతులు చించేసిన బీజేపీ.. సభలో గందరగోళం!

బ్యాంక్ ఎఫ్‌డీ కొత్త నిబంధనలు

రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ బల్క్ డిపాజిట్లు చేసే కస్టమర్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి బ్యాంకులు తమ బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ప్రతిరోజూ ఉదయం 10 గంటలకల్లా తమ వెబ్‌సైట్లలో కచ్చితంగా పెట్టాలి. ఒకే రోజు డిపాజిట్ చేసే వేర్వేరు కస్టమర్ల మధ్య లేదా వేర్వేరు బ్రాంచీల మధ్య వడ్డీ రేట్లలో ఎలాంటి తేడాలు.. వివక్ష చూపకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.