Mumbai : ముంబైలోని కుర్లా ఈస్ట్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక భారీ క్రేన్ ఇళ్లపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా గాయపడ్డారు. ఇందిరా నగర్‌లోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెనుక ఉన్న బంటారా భవన్ వద్ద ఉన్న ఎంహెచ్‌ఏడీఏ భవనం దగ్గర ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ ఇళ్లను ఖాళీ చేయించి, కూల్చివేత పనులు చేపడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Also Read : భార్యను, చెల్లిని కాల్చిచంపి ఆ పై ఆత్మహత్య.. వాట్సాప్ స్టేటస్ లో కీలక విషయం..

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం, కూల్చివేత పనుల కోసం భారీ క్రేన్‌ను ఏర్పాటు చేస్తుండగా అది అదుపుతప్పి పక్కనే ఉన్న నివాస గృహాలపై ఒక్కసారిగా బారీ శబ్దంతో పడిపోయింది. ఈ ప్రమాదంలో క్రేన్ ఒక భాగం పైనున్న విద్యుత్ తీగలపై పడటంతో కుర్లా-ట్రాంబే మార్గంలో గూడ్స్ రైళ్ల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగిందని రైల్వే అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే ముంబై ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, 108 అంబులెన్స్, స్థానిక వార్డు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో ఆరుగురిని సియాన్ ఆసుపత్రికి తరలించగా, మిగిలిన వారిని సమీపంలోని భాభా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

గత నెలలో కూడా ముంబైలోని మీరా రోడ్‌లో ఉన్న జేపీ నార్త్ సొసైటీ వద్ద ఇలాంటి క్రేన్ కూలిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన మరవక ముందే మళ్లీ కుర్లా ప్రాంతంలో క్రేన్ పడిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Also Read : నన్ను చూసి పగటి కలలు కనొద్దు: రామ్‌దేవ్‌కు కంగనా కౌంటర్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.