Motorola Edge 60 Pro
Motorola Edge 60 Pro

మిడ్-రేంజ్ మోటరోలా ఫోన్‌ను కొనాలని చూస్తుంటే.. ఇదే సరైన అవకాశం. Motorola Edge 60 Proను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ 4nm ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనికి 90W టర్బోపవర్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో కూడిన 6000mAh బ్యాటరీ ఉంది. ఇప్పుడు Motorola Edge 60 Pro పై అందుబాటులో ఉన్న డీల్స్, ఆఫర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Motorola Edge 60 Pro Offers

Motorola Edge 60 Pro మొబైల్ 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.29,999 ధరకు అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.2,450 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా రూ.22,400 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ తగ్గింపు వర్తిస్తే Motorola Edge 60 Proను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Motorola Edge 60 Pro Specifications

Motorola Edge 60 Pro ఫోన్ 2712×1220 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ట ప్రకాశంతో కూడిన 6.7-అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ 4nm ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది. ఇందులో 6,000mAh బ్యాటరీని అందించారు. ఇది 90W టర్బోపవర్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Motorola Edge 60 Pro కెమెరా విషయానికొస్తే.. వెనుక భాగంలో OIS సపోర్ట్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ఫోటో ఫోకస్ అల్ట్రా-వైడ్ కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.