Lava Aura Curve 5G
Lava Aura Curve 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ లావా తన లైనప్‌లోని మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్‌లో పరిచయం చేసింది. అదే Lava Aura Curve 5G. ఈ ఫోన్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో కంపెనీ సొంత వాయు AI కూడా ఉంది. అలాగే Lava Aura Curve 5Gలో కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, వెనుకవైపు మినీ డిస్‌ప్లేను కూడా కంపెనీ అందించింది. ఇప్పుడు దీని ధర, ఫీచర్ల గురించి మరింత తెలుసుకుందాం.

Lava Aura Curve 5G Price

Lava Aura Curve 5G ధర విషయానికొస్తే.. ఇది రూ.23,999లకు అందుబాటులో ఉంది. ఇది లావా ఆఫ్‌లైన్ రిటైల్ నెట్‌వర్క్ ద్వారా లభిస్తుంది. అంబర్ బ్లూ, స్నో సిల్వర్ కలర్‌లలో వచ్చింది.

Lava Aura Curve 5G Specifications

Lava Aura Curve 5G ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,100 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.67-అంగుళాల FHD+ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇంటెలిజెంట్ ఫీచర్ల కోసం ఇది లావా సొంత వాయు AIతో వస్తుంది. వెనుక ప్యానెల్‌లో మల్టీఫంక్షనల్ నోటిఫికేషన్ డిస్‌ప్లే ప్యానెల్ అందించారు. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులో 6GB RAM +128GB స్టోరేజ్ ఉంటుంది.

EIS సపోర్ట్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ సోనీ IMX752 ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. కంపెనీ 2 సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది.