Muslim Marriage : ముస్లిం వివాహాలపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రత్యేక మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ ముస్లిం వివాహాలకు షరియా చట్టమే వర్తిస్తుందని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. జస్టిస్ డీకే. సింగ్, జస్టిస్ టీఎమ్. నదాఫ్‌ లతో కూడుకున్న ధర్మాసనం ‘సజీద్ పర్వేజ్ v/s ఫర్జానా తాజ్’ కేసులో ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సమర్థిస్తూ ఈ తీర్పును వెలువరించింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద విడాకులు కోరుతూ భర్త దాఖలు చేసిన పిటిషన్ చెల్లదని డివిజన్ బెంచ్ ఈ సందర్భంగా తేల్చి చెప్పింది.

Also Read : జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనలో బిగ్‌ట్విస్ట్‌.. జేపీఎస్‌సీ మాజీ ఛైర్మన్ ఖియాంగ్టే అరెస్టు

Karnataka Court

‘నికాహ్’ను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ (SMA) కింద రిజిస్ట్రేషన్‌ చేసినంత మాత్రాన వివాహ మూల స్వభావం మారుతుందనుకోవడం కరక్ట్‌ కాదని కోర్టు స్పష్టం చేసింది. ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం జరిగిన పెళ్లిళ్లకు షరియా చట్టమే వర్తిస్తుందని కోర్టు తన తీర్పులో తేల్చి చెప్పింది. విదేశీ ప్రయాణాలు/ వీసా కోసం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ (SMA) కింద పెళ్లి రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన ముస్లిం పర్సనల్ లా రద్దు కాదని కోర్టు తీర్పులో వెలువరించింది.

‘నికాహ్’ చేసుకున్న దంపతులు విడాకుల కోసం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌ను ఆశ్రయించిన ఫలితం ఉండదని. వ్యక్తిగత చట్టాల ప్రకారం జరిగిన వివాహాలకు కూడా ఆయా మతపరమైన నిబంధనలే వర్తిస్తాయని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలిపింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద విడాకులు పొందాలంటే.. వివాహం కూడా అదే చట్టం కింద జరిగి ఉండటం తప్పనిసరని తన తీర్పులో స్పష్టం చేసింది.

Also Read : వారికి ప్రతి నెలా రూ.10 వేల పింఛన్.. సీఎం సంచలన ప్రకటన!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.