Karbonn Rebel 5G
Karbonn Rebel 5G

ఒకప్పుడు భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హవా చూపించిన స్వదేశీ బ్రాండ్ కార్బన్ (Karbonn) ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మార్కెట్లో‌కి రీఎంట్రీ ఇస్తోంది. ఈసారి పెద్ద ప్లాన్‌తోనే వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుత యూత్, జెన్ జెడ్, కంటెంట్ క్రియేటర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ అధికారికంగా పేర్కొంది.

Also Read : Hero Splendor సంచలన హవా: 70 కి.మీ మైలేజ్‌.. 79వేల ధర.. తొలి ఆరు నెలల్లో 21 లక్షలకు పైగా సేల్స్‌..!

ప్రస్తుత మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగిపోతుండటంతో.. సామాన్య ప్రజలకు తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను అందించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ రీఎంట్రీలో కంపెనీ తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను కూడా వెల్లడించింది. ‘కార్బన్ రెబల్ 5జీ’ (Karbonn Rebel 5G) పేరుతో దీనిని అమెజాన్‌లో టీజ్ చేసింది. అయితే కంపెనీ దీని లాంచ్ తేదీ, పూర్తి ఫీచర్లు, ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

గతంలో Mivi, Fireboltt వంటి స్వదేశీ బ్రాండ్లు రూ. 20వేల లోపు బడ్జెట్ ధరలో ఫోన్లను లాంచ్ చేసి అదిరిపోయే ఆదరణ పొందాయి. అదే బాటలో కార్బన్ కూడా బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ భారత మార్కెట్‌లో ఇతర కంపెనీ బ్రాండ్లకు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.

సామాన్యులకు తక్కువ ధరలో అందించే ఈ స్మార్ట్‌ఫోన్ ఎలాంటి ఫీచర్లను కలిగి ఉంటుందో చూసేందుకు వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంచనాల ప్రకారం.. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G70 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది.

Also Read : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: DA 3 శాతం పెంపు