దీపావళి పండుగ సందర్భంగా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి అదిరిపోయే శుభవార్త. పండుగ సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐటెల్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు ప్రకటించింది. తన స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై దీపావళి ఆఫర్లను ప్రకటించింది. రోజుకు కేవలం రూ.40లకే వాషింగ్ మెషీన్లు, టీవీలను ఈఎంఐ ఆప్షన్లలో కొనుక్కుని ఇంటికి పట్టికెళ్లొచ్చు.

ఈ సేల్‌ ద్వారా కంపెనీ బజాజ్ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఆఫర్‌ సమయంలో ఫైనాన్స్ ఉపయోగించి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే భారీ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ముఖ్యంగా వాషింగ్ మెషీన్లు, టీవీలపై ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అందువల్ల కొత్త ఐటెల్ ఫోన్ లేదా గృహోపకరణం కొనాలని ఆలోచిస్తుంటే ఇదే సరైన సమయం. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఐటెల్ దీపావళి ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

ఐటెల్ దీపావళి ఆఫర్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సేల్ నవంబర్ 10 వరకు కొనసాగనుంది. ఆసక్తిగల వినియోగదారులు సమీపంలోని ఐటెల్ స్టోర్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు.

ఐటెల్ దీపావళి ఆఫర్లు..

ఐటెల్ P80 (6GB+128GB) కొనుగోలుపై రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ఐటెల్ X50 (6GB+128GB) కొనుగోలుపై రూ.500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ఐటెల్ F30 (4GB+128GB) కొనుగోలుపై రూ.500 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఐటెల్ F30 (4GB+64GB) కొనుగోలుపై రూ.500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ఐటెల్ సిటీ 300 5G కొనుగోలుపై రూ.800 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల HD+ పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంది. ఇది ఆక్టా-కోర్ UNISOC T8200 6nm చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 5000mAh బ్యాటరీ అందించారు. ఈ ఫోన్‌లో 13-మెగాపిక్సెల్ ఆటోఫోకస్ వెనుక కెమెరా ఉంది.

గృహోపకరణాలపై ఆఫర్లు

దీపావళి సేల్ సందర్భంగా హోమ్ అప్లయన్స్‌ కొనుగోళ్లపై ఐటెల్ ఈఎంఐ ఆప్షన్‌లను అందిస్తోంది. వాషింగ్ మెషీన్లపై రోజుకు రూ.48, 32-అంగుళాల క్యూఎల్ఈడీ ఆండ్రాయిడ్ టీవీలపై రోజుకు రూ.40 నుండి ఈఎంఐ ప్రారంభమవుతుంది. ఈ ఆఫర్లలో జీరో డౌన్ పేమెంట్, అలాగే బజాజ్ ఫైనాన్స్, టీవీఎస్ క్రెడిట్, హోమ్ క్రెడిట్ ద్వారా ఫైనాన్స్ ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.