
Noodles : నేటి బిజీ లైఫ్స్టైల్లో ఇన్స్టంట్ ఫుడ్ మన డైలీ రొటీన్లో ఒక భాగమైపోయింది. ముఖ్యంగా చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన ‘ఇన్స్టంట్ నూడుల్స్’ వినియోగంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. నూడుల్స్ కల్చర్‌కు పెట్టింది పేరైన జపాన్, వియత్నాం వంటి దేశాలను కూడా వెనక్కి నెట్టి మన దేశం గ్లోబల్ లెవెల్లో సత్తా చాటింది.
ప్రపంచ ఇన్స్టంట్ నూడుల్స్ అసోసియేషన్ (WINA) తాజా గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా ఇన్స్టంట్ నూడుల్స్ తింటున్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానం దక్కించుకుంది. 2025లో మన దేశంలో ఏకంగా 9.60 బిలియన్ సర్వింగ్స్ ఖర్చయ్యాయి. భారతీయ మార్కెట్లో లోకల్ టేస్ట్‌కు తగినట్టుగా దొరికే మసాలా, కర్రీ, చికెన్ టిక్కా, వెజిటబుల్ ఫ్లేవర్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది.
Also Read : పాక్ నుంచి వచ్చిన 319 మందికి భారతీయ పౌరసత్వం
ఈ లిస్ట్‌లో టాప్-7 దేశాలు, వాటి వినియోగం ఇలా ఉన్నాయి:
చైనా & హాంకాంగ్: 43.27 బిలియన్ సర్వింగ్స్తో మొదటి స్థానం (బీఫ్, సీఫుడ్ సూప్ ఫ్లేవర్స్ పాపులర్).
ఇండోనేషియా: 14.54 బిలియన్లతో రెండో స్థానం (ఫ్రైడ్ నూడుల్స్, హలాల్ ప్రొడక్ట్స్‌కు క్రేజ్).
భారత్: 9.60 బిలియన్లతో మూడో స్థానం.
వియత్నాం: 7.46 బిలియన్లతో నాలుగో స్థానం (స్పైసీ ప్రాన్స్, ఫో రైస్ నూడుల్స్ ఫేమస్).
జపాన్: 5.95 బిలియన్లతో ఐదో స్థానం (రామెన్, ఉడాన్, హెల్తీ ప్రొడక్ట్స్).
అమెరికా: 5.23 బిలియన్లతో ఆరో స్థానం (మైక్రోవేవ్ కప్ నూడుల్స్, చికెన్ ఫ్లేవర్).
ఫిలిప్పీన్స్: 4.34 బిలియన్ సర్వింగ్స్తో ఏడో స్థానం (సిట్రస్, సీఫుడ్ రుచులు).
తక్కువ ధర, అట్రాక్టివ్ యాడ్స్, ఈజీగా ప్రిపేర్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో క్విక్ స్నాక్‌గా ఇన్స్టంట్ నూడుల్స్‌కు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే వీటిని రోజూ తినే ఫుడ్‌లా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలని న్యూట్రిషన్ నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఉండే ఉప్పు, కొవ్వుల ప్రభావాన్ని తగ్గించడానికి తాజా కూరగాయలు, ఎగ్స్ లేదా పన్నీర్ వంటి ప్రోటీన్లను జతచేసి తినడం ఆరోగ్యానికి మంచిది.
Also Read : అరే ఏంట్రా ఇది: 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి లవ్ మ్యారేజ్: అసలు కథేంటంటే?









