
Hyderabad Couple : హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త, ఆయన భార్య స్విట్జర్లాండ్ టూర్‌కు వెళ్లి అక్కడ అదృశ్యమవడం ఇప్పుడు నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. వారు కేవలం విహారయాత్రకు వెళ్లలేదని, ఇన్వెస్టర్ల దగ్గర నుండి కోట్ల రూపాయలు వసూలు చేసి దేశం దాటేశారనే ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : భారత్‌లో ఐరన్ డోమ్ క్షిపణుల ఉత్పత్తి కేంద్రం: ఇజ్రాయెల్ రక్షణ సంస్థ ‘రాఫెల్’ చర్చలు!
హైదరాబాద్‌కు చెందిన పబ్బా చంద్రశేఖర్ (51) అనే వ్యాపారవేత్త, ఆయన భార్య స్వప్న (42) గత నెల జూన్ 22న స్విట్జర్లాండ్ టూర్‌కు వెళ్లినట్లు వారి కుమార్తె శ్రేయ తెలిపారు. మొదట్లో కుటుంబ సభ్యులతో టచ్‌లోనే ఉన్న ఈ దంపతులు, జూలై 8 నుండి పూర్తిగా మాట్లాడటం మానేశారు. వారి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందిన కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారి ఇమ్మిగ్రేషన్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
అయితే, ఈ మిస్సింగ్ వెనుక ఒక పెద్ద ఆర్థిక స్కామ్ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చంద్రశేఖర్ దంపతులు గత కొన్నేళ్లుగా రకరకాల వ్యాపార అవసరాల పేరుతో, భారీ లాభాలు ఇస్తామని నమ్మించి సుమారు 60 మందికి పైగా ఇన్వెస్టర్ల దగ్గర నుండి దాదాపు 50 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వీరు పక్కా ప్లాన్‌తోనే డబ్బులతో విదేశాలకు పారిపోయారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు దీనిపై ఇంకా ఎలాంటి చీటింగ్ కేసులు పెట్టనప్పటికీ, ఇది పక్కా ఆర్థిక మోసమా లేక మరేదైనా జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Also Read : ఖర్చు లేకుండా కరెంట్ తయారీ.. జపాన్ అద్భుతం.. ఎలాగో తెలుసా?









