Honor X7e Plus 5G
Honor X7e Plus 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor X7e Plus 5G స్మార్ట్‌ఫోన్‌ తాజాగా ఖతార్‌లో విడుదలైంది. ఈ ఫోన్‌లో 6.87-అంగుళాల TFT LCD డిస్‌ప్లే ప్యానెల్ ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత MagicOS 10 అందించారు. ఈ ఫోన్‌లో AI మెమరీ, సర్కిల్-టు-సెర్చ్, AI ఎరేజర్, AI సమ్మరీ వంటి అనేక AI ఫీచర్లు ఉన్నాయి.

Honor X7e Plus 5G Price

Honor X7e Plus 5G బేస్ 6GB+128GB వేరియంట్ ధర రూ. 26,000గా కంపెనీ నిర్ణయించింది. ఇది కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ డెసర్ట్ గోల్డ్, వెల్వెట్ బ్లాక్, మెటియోర్ సిల్వర్ అనే మూడు కలర్‌లలో లభిస్తుంది.

Honor X7e Plus 5G Specifications

Honor X7e Plus 5G ఫోన్ 6.87-అంగుళాల TFT LCD డిస్‌ప్లే ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది 1592 x 720 పిక్సెల్‌ల HD+ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. కంటి ఒత్తిడిని తగ్గించడానికి ఇందులో ఐ కంఫర్ట్ మోడ్ కూడా అందించారు. Honor X7e Plus 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్ 10 పై నడుస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు సెకండరీ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. సౌండ్ కోసం ఇందులో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన పెద్ద 8100mAh బ్యాటరీ ఉంది. కంపెనీ ఈ ఫోన్‌కు IP68, IP69, IP69K రేటింగ్‌లను ఇచ్చింది. అంటే ఫోన్ నీటిలో తడిసినా ఏం కాదు. ఫోన్‌లో AI మెమరీ, సర్కిల్-టు-సెర్చ్, AI ఎరేజర్, AI సమ్మరీ వంటి అనేక AI ఫీచర్లు ఉన్నాయి.