
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న విమానంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఫ్లైదుబాయ్‌కి చెందిన ఈ విమానంలో భారత సంతతికి చెందిన ప్రధాన పైలట్ స్మిత్ మచ్చర్‌పై.. ఆయనతో పాటు ఉన్న కో-పైలట్ హమామ్ అల్-హమామి దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Also Read : ఉక్రెయిన్‌పై ఏఐ మ్యూజిక్ సైకలాజికల్ వార్.. పాటలు పెట్టి చంపేస్తున్న రష్యా
#BREAKING: UAE Prosecutor General says Flydubai co-pilot attempted to carry out terrorist attack during flight; he attacked pilot with crash axe, tried to take control of aircraft – state media pic.twitter.com/M8ss3EhBlp
— TRT World (@trtworld) October 3, 2026
మిడ్-ఎయిర్‌లో కో-పైలట్ అల్-హమామి ప్రధాన పైలట్‌పై దాడి చేయడంతో విమానం గాల్లో తీవ్ర గందరగోళానికి గురైంది. పరిస్థితిని గమనించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని వెంటనే సౌదీ అరేబియాలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా బలగాలు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నాయి. ఆ తర్వాత అతడిని విచారణ నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి తరలించారు. ప్రస్తుతం యూఏఈలో అతనిపై విచారణ జరుగుతోంది. అయితే విచారణ జరుపుతున్న అధికారులు అల్-హమామి ‘అల్-ఖైదా’ వంటి ప్రమాదకరమైన ఉగ్రవాద భావజాలంతో ప్రభావితమైనట్లు కొన్ని ఆధారాలను సేకరించారు. అతను తీవ్రవాద వైఖరి ఉన్న కొందరు మత పెద్దలను కలవడం వల్లనే ఇలాంటి ఆలోచనల వైపు మళ్లాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇజ్రాయెల్‌లో ఈ విమానాన్ని కూల్చివేయడమే అతని ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.
Also Read : ఇండియాకు బిగ్ షాక్స్… పెరిగిన క్రూడ్ అయిల్ ధర..తగ్గిన రూపాయి విలువ?
ఎవరీ హమామ్ అల్-హమామి?
ఈ కో-పైలట్ హమామ్ అల్-హమామి యూఏఈలో జన్మించినప్పటికీ.. ఒమన్, సిరియా దేశాలతో సంబంధాలు ఉన్నాయి. అతని తండ్రి ఒమన్ దేశానికి చెందినవారు కాగా, తల్లి సిరియాకు చెందినవారు. అల్-హమామి తన జీవితంలో ఎక్కువ సమయాన్ని ఒమాన్ వెలుపల, ముఖ్యంగా సిరియాలోనే గడిపాడు. సిరియాలో ఉన్న సమయంలోనే అతను తీవ్రవాద సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
అల్-హమామి గతంలో ఒమన్ జాతీయ విమానయాన సంస్థ అయిన ఒమన్ ఎయిర్‌లో కో-పైలట్ ట్రైనీగా పనిచేసేవాడు. 2024 లో అతని వద్ద నిషేధిత తీవ్రవాద సామగ్రి లభించడంతో ఒమన్ ఎయిర్‌లైన్స్ అప్రమత్తమైంది. అతనిలో ప్రమాదకరమైన తీవ్రవాద ఆలోచనలు ఉన్నాయని గుర్తించిన ఒమన్ ప్రభుత్వం, ఒమన్ ఎయిర్ యాజమాన్యం అతడిపై కఠిన చర్యలు తీసుకున్నాయి. అతడిని విమానాలు నడపకుండా పూర్తిగా నిషేధించారు. ఆ తర్వాత ఒమన్ జాతీయ విమానయాన సంస్థ నుంచి అతడిని తొలగించారు. కేవలం ఆఫీసు పనుల వంటి పరిపాలనా విభాగానికి మాత్రమే పరిమితం చేశారు తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ విమానం కాక్‌పిట్‌లోకి అడుగుపెట్టకుండా అడ్డుకున్నారు.
ఒమన్ దేశం అతడి తీవ్రవాద నేపథ్యం కారణంగా విమానాలు నడపకుండా నిషేధం విధించినప్పటికీ.. ప్రముఖ విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్ మాత్రం ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించలేదు. ఫ్లైదుబాయ్ యాజమాన్యం అల్-హమామిని తమ సంస్థలోకి ఉద్యోగిగా తీసుకుంది. అంతేకాకుండా యూఏఈ, ఇజ్రాయెల్ వంటి అత్యంత సున్నితమైన ప్రాంతాల మధ్య నడిచే విమాన మార్గంలో విమానం నడిపే బాధ్యతలను కూడా అతనికి అప్పగించింది. హమామి ఫ్లైదుబాయ్‌లో కేవలం ఎనిమిది నెలలు మాత్రమే పనిచేశాడు. అంతకుముందే ఒమన్ లో నిషేధానికి గురైన వ్యక్తిని, సెక్యూరిటీ క్లియరెన్స్ సరిగ్గా చూసుకోకుండా ఫ్లైదుబాయ్ అనుమతించినట్లు తెలుస్తోంది.









