Flipkart Freedom Sale
Flipkart Freedom Sale

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్‌ Flipkart అదిరిపోయే సేల్‌ను ప్రకటించింది. Flipkart Freedom Saleను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్‌లో పలు ప్రోడెక్టులపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్ పొందొచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్స్ కూడా లభిస్తాయి. వీటితో మరింత తక్కువ ధరకే ప్రొడెక్టులను కొనుక్కోవచ్చు. ఈ Flipkart Freedom Sale ఆగస్టు 8న ప్రారంభం కానుంది.

ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ప్రొడెక్టులు, గృహోపకరణాలపై కంపెనీ గణనీయమైన తగ్గింపులను అందిస్తోంది. ముఖ్యంగా Flipkart Freedom Saleలో గూగుల్ పిక్సెల్ 10పై ఊహించని తగ్గింపు పొందొచ్చు. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది. Google Pixel 10పై అందుబాటులో ఉన్న ఉత్తమ డీల్స్‌ను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Google Pixel 10 Discount

Flipkart Freedom Saleలో Google Pixel 10పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ సమయంలో రూ.79,999లకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ సేల్‌లో కేవలం రూ.62,999 ప్రారంభ ధరతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై EMI ఆఫర్ కూడా పొందొచ్చు. రూ.6,999 నుండి ప్రారంభమయ్యే నెలవారీ చెల్లింపులతో దీనిని సొంతం చేసుకోవచ్చు.

Google Pixel 10a Discount

Google Pixel 10a పై కూడా ఆఫర్ ఉంది. దీని అసలు ధర రూ.56,999 కాగా ఇప్పుడు కేవలం రూ.50,999 కే కొనుగోలు చేయవచ్చు. దీనిపై కూడా ఈఎంఐ ఆప్షన్ ఉంది. ప్రతి నెల రూ8,499 చెల్లించి దీనిని ఇంటికి తీసుకెళ్లొచ్చు.

Google Pixel 10 Pro Discount

Flipkart Freedom Sale సమయంలో Google Pixel 10 Pro మొబైల్ రూ. 109,999లకు లాంచ్ కాగా ఇప్పుడు రూ.99,999 కే కొనుగోలు చేయవచ్చు. దీనిని నెలకు రూ.11,111 చెల్లింపుతో సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ పిక్సెల్ 10 ప్రో XLను రూ.114,999 కే కొనుగోలు చేయవచ్చు.