Flipkart Food Delivery
Flipkart Food Delivery

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటోకు బిగ్ షాక్ ఇవ్వనుంది. త్వరలోనే ఫుడ్ డెలివరీ రంగంలోకి గ్రాండ్‌గా అడుగుపెట్టబోతోంది. ఈ రెండు సంస్థలు ఏలుతున్న ఈ మార్కెట్లో.. తనదైన ముద్ర వేసేందుకు ఫ్లిప్‌కార్ట్ సిద్ధమైంది. దీనికోసం సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకురానుంది. అదే ‘ఈట్ ఇన్ బై మినిట్స్’ (Eat in by Minutes) .

కొన్ని నివేదికల ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ ‘ఈట్ ఇన్ బై మినిట్స్’ (Eat in by Minutes) అనే పేరుతో ఈ ఫుడ్ డెలివరీ సేవను ప్రారంభించనుంది. ప్రస్తుతం దీని ట్రయల్స్ బెంగళూరులో మొదలు పెట్టారు. మొదటగా ఈ సర్వీస్‌ను కొద్ది మందికే అందించగా.. మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఏకంగా 8వేల మందికి విస్తరించారు. అయితే ఫుడ్ ఆర్డర్ చేయడం కోసం ప్రత్యేకంగా కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ మొబైల్‌లో ఉన్న ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ యాప్‌లోనే.. కొత్త ట్యాబ్‌ ఆప్షన్‌లో ఫుడ్‌ ఆర్డర్ చేసుకోవచ్చు.

ఈ నెలాఖరు నాటికి ఈ సేవలను సంస్థ అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి విడగా.. ఏ ఏ నగరాల్లో తీసుకొస్తారనే వివరాలను మాత్రం కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ సర్వీస్ వస్తే స్విగ్గీ, జొమాటో సంస్థలకు బిగ్ షాక్ అనే చెప్పాలి.