
ఇటీవల సోషల్ మీడియాలో సీజేపీ పార్టీ వైరల్ కాగా.. ఇప్పుడు తాజాగా మరో పార్టీ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదే ‘E20 జనతా పార్టీ’. అయితే ఇది ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీ కాదు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం కలిపి విక్రయించడాన్ని నిరసిస్తూ, వాహనదారుల హక్కుల కోసం సోషల్ మీడియా వేదికగా వార్ చేస్తున్నారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షలాది మంది వాహనదారులు, మధ్యతరగతి ప్రజలు దీనికి సపోర్ట్‌గా నిలిచారు. దీంతో ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. అసలు ఈ E20 జనతా పార్టీ ఏంటి? ఏం డిమాండ్ చేస్తోంది? దీని వెనుక ఉన్నది ఎవరో తెలుసుకుందాం.
Also Read : ప్రపంచాన్ని వణికిస్తున్న భారత్ పినాకా.. 44 సెకన్లలో శత్రువులు ఖతం.. పోటీపడుతున్న 12 దేశాలు
धर्मेंद्र प्रधान के इस्तीफ़े के बाद, अब सबका ध्यान फिर से E20 फ़्यूल पर आ गया है। जंतर-मंतर पर लोगों का कहना है कि अगला बड़ा मुद्दा इथेनॉल-ब्लेंडेड पेट्रोल है; E20 और सड़कों की हालत को लेकर लोगों का गुस्सा एक बार फिर नितिन गडकरी की ओर मुड़ गया है।#E20Truth #E20Fuel… pic.twitter.com/SPfWLxFL79
— E20 Janta Party (@E20__Party) July 27, 2026
Also Read : ఆకలి తీర్చడమే ధ్యేయంగా నిలిచిన ‘జునైద్’: జంతర్ మంతర్ నిరసనల్లో అసలైన రియల్ హీరో!
దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పెట్రోల్ పంపులో E20 ఇంధనంతో పాటు 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచాలన్నదే ఈ ప్రచారం ముఖ్య డిమాండ్. ఉచిత ఇంధనాన్ని గానీ లేదా ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను పూర్తిగా రద్దు చేయాలని గానీ తాము అడగడం లేదని అంటున్నారు. తమ వాహనానికి ఎలాంటి ఇంధనం కొట్టించుకోవాలో అనేది తమ ఇష్టమని, ఆ ఛాన్స్ వినియోగదారులకే వదిలేయాలని స్పష్టం చేశారు. తమ వెహికల్స్ ప్రయోగశాలలు కాదని.. లక్షలు పెట్టి కొనుకున్నవని తెలిపారు. ఇలాంటి వాహనాల ఇంజిన్‌లతో ప్రయోగాలు చేయకూడదని డిమాండ్ చేస్తున్నారు.
ఇది ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా నిలవలేదు. కేవలం పౌరులు తమ హక్కుల కోసం స్వచ్ఛందంగా చేపట్టిన ఉద్యమమని నిర్వాహకులు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలిపారు. తాము ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్‌గా నిలవడం లేదని, సాధారణ వాహనదారుల సమస్యను ప్రభుత్వానికి వినిపించడమే తమ లక్ష్యమన్నారు.
ఇటీవల నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదంపై ఆందోళనలు చేపట్టి.. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు కారణమైన ‘బొద్దింక జనతా పార్టీ’ తరహాలోనే ఈ ‘E20 జనతా పార్టీ’ కూడా వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ దీని ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది. ఎక్స్ (X) హ్యాండిల్‌లో ఫాలోవర్లు ఒక్కసారిగా 45 వేలకు పైగా పెరగ్గా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 1.44 లక్షల మందికి పైగా చేరారు.









