
Screen Protectors : నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ సర్వసాధారణమై పోయింది. అయితే వేలాది రూపాయల వెచ్చించి కొనుక్కున్న ఫోన్ బాగుండడానికి అవసరమైన అన్ని రకాల రక్షణలు తీసుకుంటుంటాం. ముఖ్యంగా అది చేతిలో నుంచి జారీపడినా ఏం కాకుండా ఉండటం కోసం రక్షణగా టెంపర్డ్ గ్లాసులు, స్ర్కీన్ గార్డులు వాడుతుంటాం. అయితే మనం వాడుతున్న స్ర్కీన్ గార్డు మంచిదా? కాదా? అనేది మనకు తెలియదు. అమ్మకం దార్లు సూచించిందే మంచిదని వాడటం మనకు అలవాటయ్యింది. అయితే ఎపుడో ఒకసారి మన ఫోన్ కిందపడటం, డ్యామేజీ కావడం సర్వసాధాణమై పోయింది. దీంతో స్ర్కీన్ గార్డు నాణ్యతపై అనుమానాలు మొదలవుతాయి. మార్కెట్లో ఇలా ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్న నాసిరకం స్ర్కీన్ ప్రొటెక్టర్లతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఇబ్బందులను తొలగించడానికి వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.
Also Read : షార్జాలో దారుణం! భారతీయుడిని చంపి.. 9 ముక్కలుగా చేసి.. భార్య,పిల్లలు మిస్సింగ్?
ఇక మీదట స్మార్ట్ఫోన్ల కు వినియోగించే స్ర్కీన్ ప్రొటెక్టర్లకు ‘భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్)’ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఎలకాట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21న దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా కేంద్రం విడుదల చేసింది. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు 2027 ఏప్రిల్ 1 నుంచి కచ్చితంగా అమల్లోకి రానున్నాయి.
బీఐఎస్ నిబంధనలకు అనుగుణంగా మారేందుకు ప్రభుత్వం తయారీదారులకు 2027 మార్చి 31 వరకు సమయం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అటు వినియోగదారులకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తుందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలకా్ట్రనిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఈ మేరకు హర్షం వ్యక్తం చేసింది. స్వదేశీ తయారీ, ఎగుమతులకు ఊతం ఇవ్వడం ద్వారా ఈ రంగం ఏకంగా రూ.12-16 వేల కోట్ల పరిశ్రమగా ఎదిగే అవకాశం అంచనా వేసింది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 60 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపింది. అటు ప్రభుత్వ ఖజానాకు సైతం రూ.2,000 కోట్ల జీఎస్టీ ఆదాయం సమకూరనుందని తెలిపింది. ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తిని పెంచుతూ నాణ్యమైన ఉత్పత్తులను అందించే దిశగా ఇదో గొప్ప ముందడుగు అని ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అశోక్ గుప్తా వెల్లడించారు. డిమాండ్‌ను తట్టుకునేందుకు గాను తమ సంస్థ అదనంగా 2 కోట్ల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు ఆయన వివరించారు.
Also Read : ఇంత గలీజ్ పనులేంట్రా బాబూ.. లిఫ్ట్‌లోనే మూత్రం పోశాడు!-VIDEO VIRAL









