
Apple Pay : ఆపిల్ ఎట్టకేలకు ఆపిల్ పే సేవలను భారత్‌లో ప్రారంభించింది. అమెరికాలో ఈ సేవ అందుబాటులోకి వచ్చి పదేళ్లు దాటిన తర్వాత ఇప్పుడు భారతీయులకు కూడా ఆపిల్ పే అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ 30 నుంచి ఐఫోన్, ఐప్యాడ్ లేదా ఆపిల్ వాచ్ ద్వారా ఆపిల్ పేతో డబ్బులు చెల్లించొచ్చు. అయితే ప్రస్తుతం ఈ సేవ యాక్సిస్ బ్యాంక్ జారీ చేసే వీసా లేదా మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని బ్యాంకుల కార్డులను కూడా ఆపిల్ పే ద్వారా ఉపయోగించే అవకాశం ఉంది.
Also Read : ATM నుంచి గ్యాస్ వరకు.. అక్టోబర్1 నుంచి కొత్త రూల్స్
ఆపిల్ పే ఉపయోగించాలంటే కనీసం ఐఓఎస్ 18 ఉన్న ఐఫోన్ ఎక్స్ఆర్ లేదా ఆ తర్వాతి మోడళ్లు అవసరం. ఆపిల్ వాచ్ విషయంలో సిరీస్ 6 లేదా ఆ తర్వాతి మోడల్, వాచ్ఓఎస్ 11 లేదా ఆ తర్వాతి వెర్షన్ ఉండాలి. ప్రస్తుతం భారత్‌లో ఆపిల్ పే ద్వారా ఆపిల్ స్టోర్, బ్లింకిట్, చాయోస్, క్రోమా, ఇక్సిగో, రిలయన్స్ సంస్థలు, టాటా 1ఎంజీ, జొమాటో తదితర సంస్థల్లో డబ్బులు చెల్లించవచ్చు. రానున్న రోజుల్లో మరిన్ని దుకాణాలు, యాప్‌లలో కూడా ఆపిల్ పే సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ఇప్పటికే భారత్‌లో యూపీఐ చెల్లింపులు భారీగా ప్రాచుర్యం పొందిన సమయంలో ఆపిల్ పే కూడా దేశంలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు మాత్రమే ఈ సౌకర్యం ఉంది. మరిన్ని బ్యాంకులు, కార్డులను ఆపిల్ పేలో చేర్చిన తర్వాత దీని వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read : ఆ నరరూప రాక్షసుడు ఖతం.. పహల్గామ్ హంతకుడు హతం!









