TMK : తమిళనాడులో సినిమాకు, రాజకీయాలకు అన్యోన్య సంబంధం ఉందటుందనేది అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఎంజీఆర్‌, జయలలిత, కరుణానిధి తాజాగా విజయ్‌ అంతా సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చినవారే. తాజాగా కోలివుడ్‌ అగ్రహీరో అజిత్‌ నేతృత్వంలో మరో రాజకీయ పార్టీ ఊపిరిపోసుకుంది. అయితే దీన్ని అజిత్‌ మాత్రం ఏర్పాటు చేయలేదు. ఆయన అభిమానులు స్థాపించారు. అంతేకాదు అజిత్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించేశారు కూడా. వివరాల్లోకి వెళితే

అగ్రహరో అజిత్ కుమార్‌ అభిమానులు ‘తమిళగ మక్కల్ కళగం(టీఎంకే) పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. అంతటితో ఆగకుండా పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. వారు రూపొందించిన జెండా ఇంచుమించుగా ప్రస్తుత అధి కార పార్టీ టీవీకే జెండాను దగ్గరగా ఉంది. నిజానికి, అజిత్ రాజకీయ ప్రవేశంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే తను రాజకీయాల్లోకి రానని అజిత్ స్వయంగా ప్రకటించినప్పటికీ ఆయన అభిమానులు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. పదేపదే ఆయన పేరును రాజకీయంగా తెరపైకి తెస్తున్నారు. ఇపుడు ఏకంగా పార్టీ పెట్టడమే కాకుండా జెండాను ఆవిష్కరించారు.

Also Read : ఎల్పీజీ సబ్సిడీ కొనసాగాలంటే ఆధార్‌తో లింక్ తప్పనిసరి..ఇంట్లో నుండే ఇలా చేసుకోండి..

తమిళనాడులోని కల్లకుర్చి జిల్లా ఉళుందూరుపేటలో అజిత్ కుమార్‌ అభిమాన సంఘాలన్నీ సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా ‘తమిళగ మక్కల్ కళగం’ పేరుతో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాయి. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆభిత్, రాష్ట్ర కార్యదర్శిగా రామ్ కుమార్, రాష్ట్ర కోశాధికారిగా మహ్మద్ షా, రాష్ట్ర ఆర్గనైజర్, ప్రచార కార్యదర్శి, కార్యవర్గ సభ్యులను కూడా నియమించారు. అయితే ప్రధాన కార్యదర్శి పదవి మాత్రం అజిత్‌ కోసం ఖాళీగా ఉంచారు

ఈ సందర్భంగా ఆయన అభిమానులు మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న అజిత్ అభిమాన సంఘాల నేతలమంతా కలిసి ఒకే తాటిపైకి వచ్చాము. మా అభిమాన నాయకుడి పేరుతో ఈ పార్టీని ఏర్పాటు చేశాం. అజిత్ సర్ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని ఆయన కోసం ఖాళీగా ఉంచాం’ అని వారు ప్రకటించారు. కాగా దీనిపై అజిత్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read : బ్యాంకు ఖాతాదారులకు బిగ్ షాక్.. వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.