Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటక పర్యటనలో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుబ్బళ్లిలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు. వైద్యుల సూచన మేరకు ఆయన హోటల్‌లోనే విశ్రాంతి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరిన్ని వివరాలను అధికారులు వెల్లడించలేదు.

Also Read : ఇరాన్‌కు ట్రంప్ దిమ్మతిరిగే షాక్.. హౌతీలతో చర్చలు .. యుద్ధానికి ఎండ్ కార్డ్!

శుక్రవారం రాత్రి అమిత్ షా హుబ్బళ్లికి చేరుకున్నారు. శనివారం గబ్బూర్‌లోని కేఎల్‌ఈ జగద్గురు గంగాధర్ మహాస్వామిగళు మూరుసవిరమఠ్ మెడికల్ కాలేజీ కొత్త అకడమిక్ భవనం, 1,200 పడకల కేఎల్‌ఈ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆరోగ్య సమస్య కారణంగా కార్యక్రమానికి వెళ్లకుండా హోటల్‌లోనే ఉన్నారు.

అమిత్ షా కార్యక్రమానికి రాలేకపోవడంతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బెళగావి ఎంపీ జగదీశ్ షెట్టర్ తదితరులు కలిసి మెడికల్ కాలేజీ, ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ విషయాన్ని కేఎల్‌ఈ సొసైటీ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్ కోరే సభలో వెల్లడించారు.

తాజా సమాచారం ప్రకారం, అమిత్ షా హుబ్బళ్లిలోని హోటల్‌లో వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని స్థానిక మీడియా నివేదికలు ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా బెళగావి జిల్లా ఎక్సాంబాలో జరగాల్సిన తదుపరి కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

Also Read : డెంగ్యూ డేంజర్‌కు ఎండ్ కార్డ్.. 2027లో భారత్‌లోకి రాబోతున్న సైలెంట్ కిల్లర్ వ్యాక్సిన్ క్యూడెంగా!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.