తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొలత్తూరు నియోజకవర్గంలో మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన తమిళగ వెట్రి కళగం (TVK) ఎమ్మెల్యే వీఎస్ బాబు (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయన, సెప్టెంబర్ 9న చెన్నై అమింజికరైలోని MGM హెల్త్‌కేర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పటి నుంచి ICUలో స్పెషల్ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అయితే, మెడికల్ టీమ్ ఎంతగా ప్రయత్నించినా ఆయన కండిషన్ మరింత క్రిటికల్‌గా మారింది. ఈ క్రమంలోనే ఈరోజు మధ్యాహ్నం 2.24 గంటలకు గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు హాస్పిటల్ మేనేజ్‌మెంట్ అఫీషియల్ స్టేట్‌మెంట్ విడుదల చేసింది.

Also Read : గుండె పగిలే తీవ్ర విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి..!

బైఎలక్షన్‌ బరిలో స్టాలిన్!

మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ మళ్లీ వచ్చే ఎన్నికల్లో పోటీ అవకాశం ఉంది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో వేడి పెరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో  వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఎంకే స్టాలిన్ మీద గెలిచారు. ఇప్పుడు ఆయన స్థాన్నాన్ని TVK పార్టీలో ఎవరితో భర్తీ చేస్తారో చూడాలి మరి. వీఎస్ బాబు పొలిటికల్ కెరీర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. డీఎంకే పార్టీలో ఒక సాధారణ ఏరియా సెక్రటరీగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన, నార్త్ చెన్నై డిస్ట్రిక్ట్ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. 2006 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పురసవాక్కం నుంచి డీఎంకే క్యాండిడేట్‌గా పోటీ చేసి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన కొలత్తూరులో 2011లో స్టాలిన్ గెలుపు వెనుక బాబు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండి, 2016లో AIADMKలో చేరారు.

ఈ ఏడాది ప్రారంభంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సమక్షంలో టీవీకే పార్టీలో జాయిన్ అయిన బాబు, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నుంచి బరిలోకి దిగారు. ఈ ఎలక్షన్స్‌లో 82,997 ఓట్లు సాధించి, తన పాత బాస్ ఎంకే స్టాలిన్‌పై (74,202 ఓట్లు) 8,795 ఓట్ల మెజారిటీతో హిస్టారిక్ విక్టరీ అందుకున్నారు. బాబు మరణంతో తమిళనాడు అసెంబ్లీలో ఖాళీ అయిన సీట్ల సంఖ్య ఆరుకు చేరింది. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : బర్డ్ ఫ్లూ ముప్పుకు చెక్.. భారత్ తొలి స్వదేశీ H5N1 వ్యాక్సిన్ సిద్ధం!