
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో బిగ్ సెన్సేషన్ నమోదైంది. YSRCPకి గుడ్ బై చెప్పి సైలెంట్‌గా ఉన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బుధవారం కొత్త పార్టీని ప్రకటించారు. తన కొత్త పార్టీ పేరును ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP) గా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే పార్టీ పేరు మాత్రమే కాదు.. జెండా, ఎజెండా కూడా గతంలో మెగాస్టార్ చిరంజీవి నడిపిన ‘ప్రజారాజ్యం పార్టీ’ (PRP)ని తలపిస్తుండటంతో, విజయసాయి రెడ్డి చిరంజీవిని కాపీ కొడుతున్నారా అనే హాట్ డిస్కషన్ మొదలైంది.
Also Read : దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీ, హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. నగరాలను కమ్మేసిన విష కాలుష్యం!
తెలంగాణలో కవిత TRS.. ఏపీలో విజయసాయి PRP!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పాత, పాపులర్ పార్టీల పేర్లతో రీ-ఎంట్రీ ఇచ్చే ట్రెండ్ నడుస్తోంది. తెలంగాణలో BRS నుంచి బయటకు వచ్చిన కవిత.. కేసీఆర్ ఒరిజినల్ పార్టీ పేరు గుర్తుకొచ్చేలా ‘తెలంగాణ రక్షణ సేన’ TRSను తెరపైకి తెచ్చారు. ఇప్పుడు అదే సేమ్ ఫార్ములాను ఏపీలో అప్లై చేస్తూ విజయసాయి రెడ్డి ‘PRP’ బ్రాండ్‌ను రీ-క్రియేట్ చేశారు.
జెండా, ఎజెండా సేమ్ టు సేమ్!
చిరంజీవి ప్రజారాజ్యం జెండాలో తెలుపు, ఆకుపచ్చ రంగుల మధ్య సూర్యుడు ఉంటే.. విజయసాయి పార్టీ జెండాలో కాషాయం, తెలుపు రంగుల మధ్య చక్రం ఉంది. ఇక ఎజెండా విషయానికి వస్తే, చిరంజీవి నాటి ప్రధాన నినాదమైన ‘సామాజిక న్యాయం’నే విజయసాయి ఎంచుకున్నారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేయడమే తన పార్టీ గోల్ అని ఆయన స్పష్టం చేశారు. అలాగే విజయసాయి రెడ్డి బీజేపీ పార్టీ నుంచి దేశం కోసం ధర్మం కోసం అనే ట్యాగ్ లైన్ తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆయన పార్టీ ఏర్పాటుపై ఏపీలో బీజేపీ యూనిట్ ఏర్పాటు అయ్యిందని సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు, జనసేన పార్టీలో ఉండే తెలుపు రంగు, చక్రం కూడా కాపీ కొట్టారంటూ కామెంట్లు వస్తున్నాయి. మొత్తం మీద అటు ఏపీలో అన్నీ పార్టీల జెండాలు, అంజెండాలు మిక్స్ చేసి కొత్త పార్టీ అని పేరు పెట్టారని చెప్పుకుంటున్నారు.
Also Read : పవన్‌కు సపోర్ట్‌గా రేణూ దేశాయ్.. విడాకులపై ఆమె రియాక్షన్ ఇదే!
నేను సీఎం రేసులో లేను: విజయసాయి రెడ్డి
విజయవాడలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో విజయసాయి కీలక కామెంట్స్ చేశారు. తాను పార్టీని ముందుండి నడిపిస్తానని, అయితే తనకు సీఎం అయ్యే ఆలోచన ఏమాత్రం లేదని క్లారిటీ ఇచ్చారు. తమ PRP తరఫున సామాన్య ప్రజల్లోంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటారని హింట్ ఇచ్చారు. ఏపీలో రెండు ప్రధాన పార్టీలు, రెండు కుటుంబాల గుత్తాధిపత్యానికి ఎండ్ కార్డ్ వేసి ప్రజలకు పాలిటిక్స్ చేరువ చేయడమే తన టార్గెట్ అని ప్రకటించారు.









