
ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, ఉత్తరాఖండ్‌లోని పవిత్ర కేదార్నాథ్ ధామ్ శీతాకాలం కారణంగా తాత్కాలికంగా మూతపడింది. వింటర్ సీజన్ స్టార్ట్ కావడంతో ఆలయ కమిటీ అధికారికంగా దర్శనాలను నిలిపివేసింది. ఈ సందర్భంగా వేలాది మంది భక్తుల ‘హర హర మహాదేవ్’ నామస్మరణలతో కేదార్నాథ్ లోయ మొత్తం భక్తిపారవశ్యంతో మార్మోగిపోయింది.
Also Read : జమ్మూకశ్మీర్‌లో CRPF జవాన్లపై ఉగ్రవాదుల కాల్పులు
The portals of the Kedarnath Temple closed for the winter season today— November 11, 2026, at 8:30 AM, on the auspicious occasion of Bhai Dooj
Jai Kedar 🕉️ https://t.co/mOuVuyxTLs
— Jaya_Upadhyaya (@Jayalko1) November 11, 2026
బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయంలో స్పెషల్ పూజలు, సంప్రదాయ వైదిక క్రతువులు మొదలయ్యాయి. ఉదయం 8:30 గంటల శుభ ముహూర్తంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య కేదారేశ్వరుడి ప్రధాన ద్వారాలకు తాళాలు వేశారు. అనంతరం బాబా కేదార్ ఉత్సవ విగ్రహమూర్తిని అశేష భక్తజనం సమక్షంలో ప్రత్యేక పల్లకీలో శీతాకాల నివాసమైన ఊకీమఠ్లోని ఓంకారేశ్వర టెంపుల్‌కు ఊరేగింపుగా తరలించారు. రానున్న ఆరు నెలల పాటు భక్తులు స్వామివారిని ఊకీమఠ్లోనే దర్శించుకోవచ్చు.
ఆలయ క్లోజింగ్ ఈవెంట్ సందర్భంగా మంగళవారం సాయంత్రం కేదార్నాథ్ పరిసరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈవెనింగ్ హారతి ముగిసిన తర్వాత ఇండియన్ ఆర్మీ బ్యాండ్ నిర్వహించిన మ్యూజికల్ పెర్ఫార్మెన్స్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ప్రధాన పూజారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
‼️आज केदारनाथ धाम के कपाट शीतकाल के लिए हुए बंद…
#kedarnath https://t.co/Axc6OynolJ— Rajesh Maurya…🖋️ (@rajesh_mauryaup) November 11, 2026
Also Read : AI 5g స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. పరుగులు పెడుతున్న కస్టమర్లు..!
ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల మందికి పైగా భక్తులు బాబా కేదార్‌నాథ్‌ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు, ప్రసిద్ధ ఛార్‌ధామ్ యాత్రలో కీలకమైన యమునోత్రి ఆలయ తలుపులను కూడా నేడు శీతాకాలం కోసం మూసివేశారు. కేదార్నాథ్ క్షేత్రం మళ్లీ వచ్చే సమ్మర్ సీజన్లో మాత్రమే భక్తుల దర్శనార్థం తిరిగి తెరుచుకోనుంది.









