స్వదేశీ పరిజ్ఞానం, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలతో భారత్ తన రక్షణ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తోంది. మనుషులు లేకుండా సముద్రంలో వేల కిలోమీటర్లు ప్రయాణించే బోట్లు, మనుషులను మోసుకెళ్లే పైలట్‌లెస్ డ్రోన్లు, లక్ష అడుగుల ఎత్తు నుంచి లాంచ్ అయ్యే UAV భారత డిఫెన్స్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నాయి.

Also Read : ఒక్క నంబర్ మిస్.. బర్త్ డేకు రూ.30 కోట్ల జాక్‌పాట్

1,500 కి.మీ ప్రయాణించిన అటానమస్ బోట్ ‘మాతంగి’

పూణేకు చెందిన ‘సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్’ అభివృద్ధి చేసిన ‘మాతంగి’ అటానమస్ సర్ఫేస్ వెస్సెల్ (ASV) భారత నావికాదళ రంగానికి భారీ బూస్ట్ ఇచ్చింది. ఎవరూ లేకుండానే సముద్రంలో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయగల ఈ బోట్, ముంబై నుంచి తమిళనాడులోని తూత్తుకుడి వరకు సుమారు 1,500 కిలోమీటర్ల దూరాన్ని ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా విజయవంతంగా పూర్తి చేసింది. అటానమస్ నావిగేషన్, కొలిజన్ అవాయిడెన్స్ (ఢీకొనకుండా తప్పించుకునే) అత్యాధునిక సిస్టమ్స్ ద్వారా ఇది సముద్రంలో సేఫ్‌గా రూట్ మ్యాప్ చేసుకుంటూ ప్రయాణించగలదు.

మనిషిని మోసుకెళ్లే డ్రోన్ ‘వరుణ’ పైలట్ అవసరం లేకుండానే ఒక మనిషిని సురక్షితంగా మోసుకెళ్లేలా సాగర్ డిఫెన్స్ ‘వరుణ’ అనే డ్రోన్‌ను రూపొందించింది. 150 కిలోల పేలోడ్ కెపాసిటీ కలిగిన ఈ డ్రోన్, ఆటోమేటిక్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ ఫీచర్లతో పనిచేస్తుంది. అత్యవసర సమయాల్లో నేవీ యుద్ధ నౌకల మధ్య సరుకులు తరలించడానికి, మెడికల్ ఎవాక్యువేషన్ (అత్యవసర చికిత్సకు తరలింపు) వంటి కీలక ఆపరేషన్లకు ఇది గేమ్ ఛేంజర్ కానుంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీని డెమోను స్వయంగా వీక్షించారు.

Also Read : సైబర్ సెక్యూరిటీకి ఏఐ ముప్పు.. అమెరికా ఓటర్ల డేటాలోకి చొరబడ్డ క్లాడ్ చాట్‌బాట్!

1.18 లక్షల అడుగుల ఎత్తు నుంచి దూసుకెళ్లే యూఏవీ ఏరోస్పేస్ స్టార్టప్ ‘కలాం ల్యాబ్స్’ స్ట్రాటోస్ఫియరిక్ యూఏవీ రంగంలో అద్భుత ఆవిష్కరణ చేసింది. బెలూన్-అసిస్టెడ్ లాంచ్ కాన్సెప్ట్‌తో పనిచేసే ఈ సిస్టమ్ ద్వారా దాదాపు 1,18,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు నుంచి డ్రోన్‌ను లాంచ్ చేయవచ్చు. సాధారణ పద్ధతులకు భిన్నంగా వాతావరణపు పైపొరల నుంచి దీనిని మోహరించే వీలుండటం భారత ఎయిర్ డిఫెన్స్ రంగానికి సరికొత్త వ్యూహాత్మక బలాన్ని అందిస్తోంది.