Central Funds: దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సెంట్రల్ గవర్నమెంట్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణ షెడ్యూల్ ప్రకారం ప్రతి నెలా 10వ తేదీన రిలీజ్ చేయాల్సిన నెలవారీ పన్నుల వాటా ఫండ్స్‌ను 5 రోజుల ముందుగానే, అంటే నవంబర్ 5నే అడ్వాన్స్‌గా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 28 రాష్ట్రాలకు కలిపి ఏకంగా రూ.1,09,019 కోట్లను కేంద్రం కేటాయించింది.

పండుగల సమయంలో రాష్ట్రాలపై ఖర్చుల భారం ఎక్కువగా ఉంటుంది. ఈ టైమ్‌లో స్టేట్ గవర్నమెంట్లకు ఫైనాన్షియల్ సపోర్ట్ అందించడంతో పాటు పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్‌మెంట్ పనులకు ఎలాంటి ఫండ్స్ కొరత రాకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ డెసిషన్ తీసుకుంది. ముఖ్యంగా రోడ్లు, బ్రిడ్జిలు, ప్రాజెక్టుల వంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కోసం చేసే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్  పనులను మరింత స్పీడప్ చేయడానికి ఈ అమౌంట్ కీలకంగా మారనుంది.

తెలుగు రాష్ట్రాలకు రూ.6,967 కోట్లు

కేంద్రం రిలీజ్ చేసిన మొత్తం ఫండ్స్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి భారీగానే నిధులు దక్కాయి:

ఆంధ్రప్రదేశ్: ఏపీకి రూ.4,597 కోట్లు అలాట్ అయ్యాయి.

తెలంగాణ: తెలంగాణ రాష్ట్రానికి రూ.2,370 కోట్లు అందనున్నాయి.

మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు రూ.6,967 కోట్ల నిధులు సమకూరడంతో సంక్షేమ పథకాల అమలు, డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌కు మంచి బూస్టింగ్ లభించినట్లయింది.

టాప్‌లో యూపీ, బీహార్

స్టేట్స్ వారీగా కేటాయింపులను పరిశీలిస్తే, దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.19,208 కోట్లు అందాయి. ఆ తర్వాత స్థానంలో నిలిచిన బీహార్‌కు రూ.10,845 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న 28 రాష్ట్రాల ఫైనాన్షియల్ నీడ్స్‌ను దృష్టిలో పెట్టుకుని టైమ్ కంటే ముందే ఫండ్స్ క్రెడిట్ చేయడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఊరట లభించింది.