
దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో పెరుగుతున్న స్టడీ ప్రెజర్, ఎమోషనల్ స్ట్రెస్ కారణంగా హాస్టళ్లలో బలవన్మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ (VNSGU) తమ క్యాంపస్ హాస్టళ్లలో సూసైడ్స్ నివారణకు ఒక కొత్త సేఫ్టీ మెజర్ను అమల్లోకి తెచ్చింది. విద్యార్థులు ఉరివేసుకునే ఘటనలను అడ్డుకోవడానికి ఏకంగా 354 ప్రత్యేక ‘యాంటీ సూసైడ్’ ఫ్యాన్లను హాస్టల్ గదుల్లో ఇన్స్టాల్ చేసింది.
Also Read : రక్తం చిందిన రోడ్డు.. ఛిద్రమైన శరీరాలు: భయానక దృశ్యాలు..!
ఎలా పనిచేస్తుంది ఈ టెక్నాలజీ?
సుమారు రూ.1,500 ఖర్చుతో రూపొందించిన ఈ ఫ్యాన్లలో ఒక స్పెషల్ స్ప్రింగ్ మెకానిజమ్ ఉంటుంది. ఫ్యాన్‌పై 10 కిలోల కంటే ఎక్కువ బరువు లేదా ప్రెజర్ పడగానే, లోపలి స్ప్రింగ్ రిలీజ్ అయి ఫ్యాన్ రాడ్ కిందకు జారిపోతుంది. అదే సమయంలో దానికి ఉండే పవర్ సప్లై పూర్తిగా ఆగిపోతుంది.ఫ్యాన్ మనిషి బరువును మోయలేకపోవడంతో ఆత్మహత్యాయత్నం విఫలమై, ప్రాణాపాయం తప్పుతుంది.
ఈ సిస్టమ్ పనితీరును నిర్ధారించడానికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కిషోర్‌సింగ్ చావ్డా స్వయంగా రంగంలోకి దిగారు. హాస్టల్ గదిలో దుప్పటి సహాయంతో ఈ స్ప్రింగ్ మెకానిజమ్‌ను టెస్ట్ చేసి, ప్రాక్టికల్‌గా డెమో ఇచ్చారు.
యూనివర్సిటీ తీసుకున్న ఈ ప్రొటెక్టివ్ స్టెప్‌పై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భౌతిక రక్షణగా ఫ్యాన్లు మార్చడం మంచిదే అయినా, అసలైన సమస్యను ఇది పూర్తిగా పరిష్కరించలేదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఫ్యాన్లు మార్చినంత మాత్రాన విద్యార్థుల డిప్రెషన్, ఎగ్జామ్ యాంగ్జైటీ తగ్గిపోవని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.
నిజమైన సమస్య విద్యార్థుల మైండ్‌సెట్, కెరీర్ ఒత్తిళ్లలోనే ఉందని ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి మెకానికల్ సేఫ్టీ సిస్టమ్స్‌తో పాటు, క్యాంపస్‌లలో రెగ్యులర్ మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్, ఓపెన్ డిస్కషన్స్, స్టూడెంట్-ఫ్రెండ్లీ వాతావరణం కల్పించినప్పుడే ఈ తీవ్ర సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Also Read : నూడుల్స్ వల్ల కాదు.. ఫ్యామిలీ డెత్ కేసులో బిగ్ ట్విస్ట్!









