Yash : కన్నడ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ ఇటీవల థియేటర్లలో విడుదలైంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా చాలా మంది నుంచి నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ చర్చ జరుగుతున్న సమయంలో నిర్మాత అల్లు అరవింద్ గతంలో యశ్ గురించి చేసిన ఓ వ్యాఖ్య మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కోటబొమ్మాళి PS సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో అల్లు అరవింద్ సినిమాల బడ్జెట్, హీరోల రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు. సినిమా స్థాయి పెరిగితే హీరో ఇమేజ్, సినిమాపై ఆసక్తి కూడా ఎలా పెరుగుతుందో చెబుతూ.. KGFకు ముందు యశ్ ఎవరు అని ప్రశ్నించారు.

ఈ కామెంట్‌ యశ్ అభిమానులకు నచ్చలేదు. KGF సినిమాకు ముందు కూడా యశ్ కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి స్టార్‌గా ఉన్నారని, ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారని వారు గుర్తుచేశారు.

ఇప్పుడు ఈ కామెంట్స్ పై యశ్ తల్లి పుష్ప స్పందించారు. తన కుమారుడు KGFకు ముందే కర్ణాటకలో ప్రముఖ హీరోగా గుర్తింపు పొందాడని ఆమె చెప్పారు. KGFతో యశ్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు మరింత పెరిగిందని, అంతకుముందే అతనికి తన సొంత ఫ్యాన్ బేస్, విజయవంతమైన సినిమాలు ఉన్నాయని తెలిపారు.

యశ్ సినీ ప్రయాణం ఎలాంటి వారసత్వం లేకుండా మొదలైందని పుష్ప గుర్తుచేశారు. తన కుమారుడి ఎదుగుదల వెనుక కష్టం, పట్టుదల మాత్రమే ఉన్నాయని చెప్పారు. తమ కుటుంబానికి పెద్దగా ఆస్తులు, డబ్బు లేదా సినిమా నేపథ్యం ఏదీ లేదని అన్నారు.

సినీ కుటుంబాల నుంచి వచ్చిన వారు స్వయంగా ఎదిగిన నటుడిని చూసి ఎందుకు భయపడాలని కూడా పుష్ప ప్రశ్నించారు. ఎలాంటి అండ లేకుండా యశ్ తన కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నాడని చెప్పారు. తన కుమారుడి విజయాలపై తాను ఎంతో గర్వంగా ఉన్నానని పుష్ప స్పష్టం చేశారు. యశ్ సాధించిన ప్రతి విజయం అతని సొంత కష్టంతో, ప్రతిభతో వచ్చినదేనని ఆమె గట్టిగా చెప్పారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.