Ranabali
Ranabali

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే కలెక్షన్లను రాబడుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు ప్రేక్షకుల ఆదరణ తోడవడంతో ‘రణబాలి’ కిర్రాక్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది.

Also Read : ‘DNK’ టీజర్‌ నవ్వులే నవ్వుల్.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ మౌళి కామెడీ టైమింగ్ సూపరెహే..

దసరా సెలవుల్లో హౌస్‌ఫుల్ వసూళ్లు

‘రణబాలి’ మూవీకి దసరా పండుగ కలిసొచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా మంగళవారం దసరా సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్లు సాధించింది. విడుదల సమయంలో దసరా పండుగ సెలవులు, ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి సినిమా వసూళ్లకు మరింత కారణమయ్యాయి. అందులోనూ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట పెళ్లి తర్వాత వచ్చిన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొనడం కూడా మరొక కారణంగానే చెప్పుకోవచ్చు.

బ్రేక్‌ఈవెన్ దిశగా ‘రణబాలి’

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘రణబాలి’ ఇప్పటివరకు తన ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సుమారు 70 శాతం వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. దీంతో సినిమా బ్రేక్‌ఈవెన్‌కు చేరువైందనే చెప్పాలి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఈ సినిమా బ్రేక్‌ఈవెన్ సాధించి లాభాల బాటలో పరుగులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జోరు కొనసాగితే ఈ వారంలోనే అన్ని ఏరియాల్లో బ్రేక్‌ఈవెన్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read : టైగర్ ష్రాఫ్‌పై గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిత్ కాల్పుల కలకలం.. ఈ దాడి వెనుక ఉన్నది బిష్ణోయ్ గ్యాంగేనా?

విజయ్‌–రష్మిక ప్రమోషన్లు కలిసొచ్చాయా?

‘రణబాలి’ స్టోరీ చారిత్రక నేపథ్యంతో సాగుతుండటంతో.. ఈ కథను ప్రేక్షకులకు చేరువ చేయడానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రత్యేకంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇలాంటి స్టోరీలు చాలా రేర్‌గా వస్తాయని, చరిత్రలోని ఓ ముఖ్యమైన కథను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇద్దరూ సినిమాను విస్తృతంగా ప్రమోట్ చేసినట్లు తెలుస్తోంది. వారి ప్రమోషన్స్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషించినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.

రూ.55–60 కోట్ల గ్రాస్ వసూళ్లు?

అదిరిపోయే టాక్‌తో ‘రణబాలి’ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.55 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న జంటకు ఉన్న క్రేజ్, దసరా సెలవులు, వారి ప్రమోషన్స్ ‘రణబాలి’కి బాక్సాఫీస్ వద్ద కలిసొస్తున్నాయనే చెప్పాలి.