
Rashmika Mandanna : విజయ్ దేవరకొండను 100 సార్లు పెళ్లి చేసుకుందామని అడిగానని చెప్పడంతో తనపై వచ్చిన ట్రోలింగ్‌పై హీరోయిన్ రష్మిక మందన్న స్పందించింది. విజయ్‌తో తన బంధం గురించి, తనకు వచ్చిన ఉచిత సలహాల గురించి సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ నోట్ రాసింది. కాఫీ విత్ కరణ్ సీజన్ 9లో రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో విజయ్.. తనను 100 సార్లు పెళ్లి చేసుకోమని అడగాలని చెప్పాడని, అందుకే తాను ఏడాది పాటు అతడిని పెళ్లి చేసుకుందామని అడిగానని రష్మిక చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై చాలా మంది ట్రోలింగ్ చేశారు. కొంతమంది మహిళలు ఆమెకు రిలేషన్షిప్ గురించి సలహాలు కూడా ఇచ్చారు. విజయ్ కూడా విమర్శలు ఎదుర్కొన్నారు.
Also Read : ఇండస్ట్రీలో బిగ్ షాక్: సెన్సార్ బోర్డు నుంచి 500+ సినిమాలు లీక్!
దీనిపై స్పందించిన రష్మిక.. తమ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పింది. “ఇది 100 సార్లు, ఏడాది మొత్తం అనే విషయం కాదు. మేమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకోవడానికి సమయం తీసుకున్నాం. జీవితంలో ఎన్ని సంతోషాలు, కష్టాలు వచ్చినా కలిసి ఉండాలనుకుంటున్నామా అని ఆలోచించుకున్నాం. చివరికి మేము ఒకరినొకరం ఎంచుకున్నాం” అని చెప్పింది. పెళ్లి విషయంలో తనకు ముందే స్పష్టత ఉందని, విజయ్ మాత్రం జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనుకున్నాడని రష్మిక తెలిపింది. ఇద్దరి ఆలోచనా విధానం వేరైనా తమ ప్రేమలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పింది. తమకు పెళ్లి అంటే కేవలం ప్రపోజల్ చేయడం, మోకాళ్లపై కూర్చుని రింగ్ ఇవ్వడం కాదని రష్మిక చెప్పింది. కలిసి ఒక జీవితం, భవిష్యత్తును నిర్మించుకోవడమే తమకు ముఖ్యమని తెలిపింది.
విజయ్ను తాను చాలా ప్రేమిస్తున్నానని చెప్పిన రష్మిక.. “నా మనిషిపై నాకు చాలా ప్రేమ ఉంది. అందులో తప్పేముంది? నేను పెళ్లి చేసుకునే వ్యక్తిని ప్రేమించకపోతే అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? అతను జీవితాంతం నా తోడుగా ఉంటాడు. నా స్నేహితుడు, నా పిల్లల తండ్రి, నేను వృద్ధాప్యంలోకి వెళ్లే వ్యక్తి” అని చెప్పింది. తనకు రిలేషన్షిప్ గురించి సలహాలు ఇచ్చిన వారిపైనా రష్మిక స్పందించింది. కష్టాల్లో ఉన్న సమయంలో తనకు విజయ్ అండగా నిలిచాడని చెప్పింది. అందుకే తన గురించి కానీ, విజయ్ గురించి కానీ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రష్మిక స్పష్టం చేసింది.
కర్ణాటకకు చెందిన తన అభిమానులను ఉద్దేశించి రష్మిక.. పదేళ్లు గడిచినా తనను ఇంకా గుర్తుపెట్టుకుని ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపింది. ప్రేమ, సంతోషాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికీ తన ప్రేమ ఉంటుందని చెప్పింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి ఇటీవల ‘రణబాలి’ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది.
Also Read : దసరా పండుగ వేళ: రెండో కుమార్తెకు ‘అమ్మవారు’ పేరు పెట్టిన దీపికా-రణ్వీర్ లవ్ కపుల్..









