Paid Subscription : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్ల కోసం ప్రవేశపెట్టిన ‘పెయిడ్ సబ్‌స్క్రిప్షన్’ (Paid Subscription) ఫీచర్ నేడు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఒక అద్భుతమైన ఆదాయ వనరుగా మారింది. తమ పర్సనల్, ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను వీక్షించేందుకు ఫ్యాన్స్ నుండి నెలవారీ రుసుము వసూలు చేసే ఈ సరికొత్త విధానాన్ని టాలీవుడ్‌కు పరిచయం చేయడంలో యాంకర్ విష్ణుప్రియ ముఖ్య భూమిక పోషించారు. టీవీ షోలు, పటాస్ వంటి కార్యక్రమాలతో బుల్లితెరపై తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ఆమె, బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంటర్ అయిన తర్వాత తన ఫ్యాన్ బేస్‌ను మరింత పెంచుకున్నారు.
అదే బాటలో మరికొందరు
ఆమె అడుగుజాడల్లో అనన్య నాగళ్ల, అషు రెడ్డి, సిరి హనుమంత్ వంటి టాలీవుడ్ ఇన్‌ఫ్లూయెన్సర్స్ ఈ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ రేసులోకి వచ్చినప్పటికీ, ఆదాయ మార్జనలో విష్ణుప్రియ అందరినీ వెనక్కి నెట్టి అగ్రస్థానంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం అమ్మడు టీవీ షోల కంటే కూడా సోషల్ మీడియాలోనే ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. రోజూ గ్లామరస్ ఫోటోషూట్స్, హాట్ వీడియోలు, ఇంట్రెస్టింగ్ లైవ్ సెషన్స్‌తో కుర్రాళ్లకు అస్సలు నిద్ర లేకుండా చేస్తూ భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. అయితే, ఇటీవల కాలంలో ఆమె చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్, వివాదాస్పద పోస్టులే ఆమెకు ఊహించని రీతిలో కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయని తెలుస్తోంది.
ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌కు నెలకు రూ. 390 
విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి సబ్‌స్క్రైబర్లకు నెలకు రూ. 390 చొప్పున ఫీజును నిర్ణయించారు. గత కొన్ని రోజులుగా ఈ వివాదాల నేపథ్యంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ద్వారా విష్ణుప్రియను ఫాలో అవుతున్న వారి సంఖ్య ఏకంగా 7,460కి చేరింది. ఒక సాధారణ యాంకర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ రేంజ్ లో సెలబ్రిటీ బిజినెస్‌ను నడపడం ఇంటర్నెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
7,460 మంది సబ్‌స్క్రైబర్లు
ఈ సబ్‌స్క్రైబర్ల కౌంట్ ఆధారంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే, 7,460 మంది సబ్‌స్క్రైబర్ల ద్వారా ఆమెకు ప్రతి నెలా ఏకంగా రూ. 29,09,400 (దాదాపు 30 లక్షల రూపాయలు) గ్రాస్ ఇన్‌కమ్ వస్తున్నట్లు సమాచారం. ఇందులో ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్ ఫీజులు, ప్రభుత్వ పన్నులు అన్నీ కట్ అయినప్పటికీ, నెల తిరిగేసరికి ఆమె చేతికి అందుతున్న నికర ఆదాయం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. సోషల్ మీడియా పవర్‌తో నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తూ విష్ణుప్రియ అత్యంత లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తోంది.
బోల్డ్ కామెంట్స్ తో ఇంటర్నెట్‌షేక్
కానీ, ఈ సడన్ పాపులారిటీ, భారీ నెలవారీ ఆదాయం వెనుక పెద్ద వివాదాలే దాగి ఉన్నాయి. ఇటీవల ఒక లైవ్ వీడియో సెషన్‌లో విష్ణుప్రియ మాట్లాడుతూ.. “నా బాడీ కౌంట్ 5” అంటూ చేసిన బోల్డ్ కామెంట్స్ ఇంటర్నెట్‌ను తీవ్రంగా షేక్ చేశాయి. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారమే రేగింది, ట్రోలర్స్‌కు ఇది పెద్ద ఆయుధంగా మారింది. దీనికి తోడు ఆమె తన పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లో షేర్ చేస్తున్న ఎక్స్‌క్లూజివ్ గ్లామరస్ ఫొటోలు, హాట్ వీడియోల కంటెంట్‌పై కూడా నెటిజన్ల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
వివాదం..కేసులు
ఈ క్రమంలోనే ‘కంటెంట్ మితిమీరిపోతోంది’ అంటూ కొన్ని విద్యార్థి సంఘాలు, సామాజిక వర్గాలు ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఆమెపై కేసులు కూడా ఫైల్ చేశారు. సాధారణంగా ఇంటర్నెట్‌లో ఇలాంటి వివాదాస్పదమైన విషయాలు వైరల్ అయినప్పుడు ‘అసలు ఏం జరుగుతోంది?’ అని చూసే జనాల క్యూరియాసిటీ పెరుగుతుంది. విష్ణుప్రియ విషయంలో కూడా అదే జరిగింది. ఈ వివాదానికి ముందు ఉన్న సబ్‌స్క్రైబర్ల కౌంట్ కంటే, వివాదం ముదిరిన తర్వాతే ఆమె సబ్‌స్క్రిప్షన్ కౌంట్ రాకెట్‌లా దూసుకెళ్లిందని సోషల్ మీడియా అనలిస్ట్‌లు చెబుతున్నారు.
పోలీసులకు ఫిర్యాదు
మరోవైపు, ఈ వివాదాల నేపథ్యంలో సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న విపరీతమైన ట్రోలింగ్  నెగెటివ్ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలంటూ విష్ణుప్రియ రీసెంట్‌గా మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు, యూట్యూబ్ ఛానళ్లపై ఆమె పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారాన్ని చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.
నెగెటివ్ పబ్లిసిటీ అయినా, పాజిటివ్ పబ్లిసిటీ అయినా.. అల్టిమేట్‌గా అకౌంట్‌లో బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే చాలన్న చందంగా దూసుకుపోతున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ ఉదంతం ప్రస్తుతం నెట్ ఇంట సంచలనంగా మారింది. క్రేజ్ ఎప్పుడూ కాంట్రవర్సీతోనే ఎక్కువ అవుతుందని విష్ణుప్రియ మరోసారి ప్రూవ్ చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ వివాదాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.