Harilo Ranga Hari : ‘హరిలో రంగ హరి’ చిన్న షార్ట్‌ ఫిల్మ్‌ గా విడుదలైన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోంది. గ్రామీణ నేపథ్యంలోని కుటుంబ బంధాలు, అపార్థాలు, త్యాగాలు, హృదయాన్ని తాకే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ముఖ్యంగా బావ, మరదలి మధ్య లవ్ స్టోరీ ఎంతో ఎమోషనల్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శతానంద ఈ కథను రాయగా, హరీష్‌ నూకాలా దర్శకత్వం వహించారు. ప్రవీణ్‌ తోట, మౌనిక రెడ్డి బావ మరదలు పాత్రలో నటించారు. వనిషా నాయక్‌, సముద్రాల, హరీష్‌ నల్లాని, శ్రీశైలం తదితరులు కీలక పాత్రలు పోషించారు. హర్షిణి పిక్చర్స్‌ బ్యానర్‌పై కె. హర్షిణి యాదవ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది. ఇంకా చూడని వారు యూట్యూబ్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Also Read : కన్నీళ్లు పెట్టిస్తున్న ‘PYRE’ మూవీ

ఇటీవలే  ‘ప్రేమాయణం’

ఇటీవలే ఇదే బ్యానర్ పై గ్రామీణ నేపథ్యంలో వచ్చిన మరో వెబ్ సిరీస్ ‘ప్రేమాయణం’ మూవీకి కూడా మంచి ప్రేక్షకాదరణ దక్కుతోంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు కూడా యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. తక్కువ బడ్జెట్ లో మంచి కథా, కథనంతో దూసుకుపోతున్నాయి. ఈ చిత్రాలను సంబంధించిన డైలాగ్స్, పలు సన్నివేశాలు షార్ట్స్, రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : బ్రా లేకుండా.. షర్ట్ బటన్లు విప్పమన్నారు: నటి షాకింగ్ కామెంట్స్..!