
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో నేడు భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ రిలీజైంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఉదయాన్నే షోలకు వెళ్లారు. ఇప్పటికే ఓవర్సీస్‌లోనూ పెద్ది ప్రీమియర్ షోలు పడ్డాయి. అయితే మరి ఈ మూవీ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.
PEDDI FULL REVIEW !
Second Half is The key of the Movie , the movie is full of good meaning and keeps you hooked to the screen , Will give an wholesome Feel after watching this.
The biggest Piller is this man @BuchiBabuSana , what a Beautiful story & presentation Saaaarrr… pic.twitter.com/YifkOdSUYk
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) June 3, 2026
సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి ఎండ్ వరకు అదిరిపోయిందని రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ప్రీ-ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు సాగే యాక్షన్ సీక్వెన్స్, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ బాడీ బిల్డింగ్ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, రామ్ చరణ్ మాస్ డాన్స్ స్టెప్పులకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. జాన్వీ కపూర్ గ్లామర్ మాస్ ప్రేక్షకులను అలరించింది. అయితే ఫస్టాఫ్‌లో లవ్ ట్రాక్ అంతగా వర్కవుట్ కాలేదని, స్క్రీన్‌ప్లే అక్కడక్కడ నెమ్మదించిందని కొందరు అంటున్నారు.
కొన్ని చోట్ల ఫస్టాప్ స్లో అనిపిస్తే.. సెకండాఫ్‌లో కథ ఢిల్లీకి షిఫ్ట్ అవుతుంది. చివరి 40 నిమిషాల యాక్షన్ సన్నివేశాలు, నైట్ క్రికెట్ మ్యాచ్ సీన్స్, పహిల్వాన్ ఫైట్ సీక్వెన్సులు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. క్లైమాక్స్‌లో రామ్ చరణ్ నటన పీక్స్‌లో ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. నిజానికి సినిమా మొత్తానికి రామ్ చరణ్ యాక్టింగ్ అదిరిపోయిందని అనవచ్చు. సన్నివేశాల్లో రామ్ చరణ్ నటన అందరినీ భావోద్వేగానికి గురిచేస్తుందని చెబుతున్నారు. రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో సినిమాను తన భుజాలపై మోశారు. ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసిందని అనవచ్చు.
సినిమా నిడివి ఎక్కువ సమయం ఉంది. కాస్త ఎడిటింగ్‌పై దృష్టి కొన్ని సీన్లను తీసేసి ఉంటే బాగుండని ఫ్యాన్స్ అంటున్నారు. స్క్రీన్ ప్లే రొటీన్ ఉందని, విజువల్స్, లోకేషన్స్, సినిమాటోగ్రఫ్రీ బాగుందని పలువరు అంటున్నారు. అయితే మరికొందరు సినిమా ఫ్లాప్ అని, మరో గేమ్ ఛేంజర్ అని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. జాన్వీ కపూర్ యాక్టింగ్ బాగుందని, కాకపోతే ఎక్కువగా ఆమె స్టోరీ లేదు.









