Annamalai : యష్ హీరోగా నటించిన టాక్సిక్ సినిమాపై బీజేపీ మాజీ లీడర్ అన్నామలై సీరియస్ అయ్యారు. ఈ సినిమాలో ఆడవాళ్లను తప్పుగా చూపించారని, ఇది చూసి పిల్లలు చెడిపోయే అవకాశం ఉందని ఆయన అన్నారు. అంతేకాదు, ఇలాంటి సినిమాలకు సెన్సార్ బోర్డ్ ఎలా పర్మిషన్ ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. కోయంబత్తూరులో జరిగిన మీటింగ్‌లో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

ఈ సినిమా మొదటి రోజే 104 కోట్లు సంపాదించిందని నిన్న విన్నాను. మనం ఎవరినైనా విషం కక్కుతున్నారంటాం, కానీ వీళ్ళు ఏకంగా సినిమా పేరునే టాక్సిక్ అని పెట్టారు. ఈ సినిమాలో ఆడవాళ్లను చాలా చీప్‌గా చూపించారు, అయినా సరే బాగా డబ్బులు సంపాదిస్తున్నారని అన్నామలై విమర్శించారు.

మన పిల్లలు ఇలాంటి సినిమాలు చూస్తే మన దేశం పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. మనం సిటీలకి పోయి ఆడవాళ్ళ సేఫ్టీ గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతాం, కానీ సెన్సార్ బోర్డ్ మాత్రం ఇలాంటి సినిమాలకి సర్టిఫికేట్ ఇచ్చి రిలీజ్ చేస్తోంది. అసలు ఈ సినిమాలో ఆడవాళ్ళకి కనీస గౌరవం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.

ఈ సినిమాలో ఆడవాళ్ళని చూపించిన తీరు, బూతులు, అలాగే దారుణమైన రక్తపాతం సీన్ల వల్ల ఇప్పుడు ఇది పెద్ద వివాచమైంది. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ కన్నడ యాక్షన్ సినిమా, ఇంగ్లీష్ మినహా మిగతా అన్ని భాషల్లో కలిపి ఫస్ట్ డేనే రూ. 108 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాను సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో తీశారు. హిందీ, తమిళం, తెలుగు, మలయాళంతో పాటు చాలా భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా రూ. 55.4 కోట్లు వసూలు చేసి, గతంలో యష్ నటించిన కేజీఎఫ్ 2 మొదటి రోజు కలెక్షన్ల రికార్డును కూడా బ్రేక్ చేసింది.

ఈ సినిమాలో యష్ రాయ్, టికెట్ అనే రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించి అదరగొట్టాడు. ఆయన యాక్షన్, స్టైలే ఈ సినిమాకి పెద్ద ప్లస్ అని మేకర్స్ అంటున్నారు. అయితే, రెండో రోజు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు బాగా తగ్గిపోయింది. ధురంధర్ 2 లాంటి పెద్ద సినిమాలాగా ఇది సెకండ్ డే పెద్దగా కలెక్షన్లు సాధించలేకపోయింది. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి లాంటి పెద్ద హీరోయిన్లు నటించారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.