wife lodged a complaint against her husband at the Vijayawada Women's Police Station
wife lodged a complaint against her husband at the Vijayawada Women's Police Station

తూర్పు గోదావరి జిల్లా(east-godavari) రాజమండ్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తకు 50 మంది మహిళలతో అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపణలు చేసింది. ఈ మేరకు విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించింది. మహిళలతో ఏకాంతంగా ఉన్న వీడియోలు రికార్డు చేస్తున్నాడని.. ఈ వీడియోలను అడ్డుపెట్టుకొని ఆ మహిళలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.  

https://youtube.com/watch?v=9JrHd7ghBUE%3Ffeature%3Doembed

Also Read: 61 మంది మహిళలపై లైంగిక వేధింపులు..  భారతీయుడికి 13ఏళ్ల జైల శిక్ష!

Wife Complaints About Her Husband

Wife Complaints: ”2017లో నా భర్తను లవ్‌ మ్యారెజ్ చేసుకున్నాను. రెండు సంవత్సరాల వరకు నన్ను బాగానే చూసుకున్నాడు. కానీ పెళ్లికి ముందు నుంచే అతడికి అక్రమ సంబంధాలు ఉన్నాయనే విషయం నాకు తెలిసింది. వ్యాపారం కోసం నా దగ్గర 100 గ్రాముల బంగారం, రూ.60 లక్షల బ్యాంకు లోన్లు, రెండు ప్లాట్లు తీసుకున్నాడు. మున్సిపల్ ఆఫీసులో పనిచేసే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అతడికి మొత్తం 50 మంది మహిళలతో అక్రమ సంబంధం ఉంది.  

Also Read: రాహుల్, ప్రియాంక వాయనాడ్‌ను మర్చిపోండి.. కాంగ్రెస్‌లో పోస్టర్ల కలకలం!

ఆ మహిళలతో ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసుకొని బ్లాక్‌ మెయిల్ చేస్తున్నాడు. నాతో కూడా ఏకాంతంగా ఉన్న వీడియోలు తీసుకొని బ్లాక్ మెయిల్ చేశాడు. మే 4వ తేదీన నన్ను కొట్టాడు. చంపుతానంటూ బెదిరించాడు. అతడికి భయపడి నేను పారిపోయాను. నా భర్తతో నాకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినట్లు” బాధిత మహిళ తెలిపారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.