
ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే అందరికీ గుర్తుకొచ్చేవి జొమాటో, స్విగ్గీ. కానీ ప్రముఖ టెలికాం సంస్థ జియో కూడా ఫుడ్ డెలివరీ రంగంలో దూసుకుపోతోందని మీకు తెలుసా?.. అవునండీ నిజమే.. జియో ‘జియోమీల్స్’ (JioMeals) అనే పేరుతో సొంత ఫుడ్ డెలివరీ యాప్‌ను రన్ చేస్తోంది. ఈ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం చాలా ఈజీ కూడా. ఇందులో నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ చేయడానికి.. అలాగే మీకు ఎలా కావాలో అలా కోరుకున్నట్లుగా వంటకాలను సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఆహారం రెస్టారెంట్ ధరలకే లభిస్తుంది. ఫుడ్‌ను ఆర్డర్ చేసిన తర్వాత దానిని రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా చేయవచ్చు. సహాయం కోసం ఇందులో ఏఐ అసిస్టెంట్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ యాప్ అందరికీ కాకుండా.. కొంతమంది ప్రత్యేక వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.
‘టెలికాం టాక్’ నివేదిక ప్రకారం.. జియో మీల్స్ యాప్ కేవలం రిలయన్స్ కార్పొరేట్ పార్క్ (RCP)లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం మాత్రమే ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఇది సాధారణ కస్లమర్ల కోసం భవిష్యత్తులో అందుబాటులోకి వస్తుందా? లేదా? అనేది ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
జియోమీల్స్ ప్రత్యేకతలు
సాధారణంగా ఇతర ఫుడ్ డెలివరీ యాప్‌లలో రెస్టారెంట్ కంటే ఎక్కువ ధరలు ఉంటాయి. కానీ జియోమీల్స్లో మాత్రం రెస్టారెంట్ ఫిక్స్ చేసిన ధరలకే ఉద్యోగులకు ఫుడ్ లభిస్తుంది. ఇందులో ఎలాంటి ఎక్స్ ట్రా ఛార్జెస్ ఉండవు. ఫుడ్ ఆర్డర్ చేసే సమయంలో సూచనలు, సలహాలు అందించేందుకు ‘రియో’ అనే ఏఐ అసిస్టెంట్ ఇందులో ఉంది.









