
Crime News : విశాఖ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన పెందుర్తి మండలం చింతలగ్రహారం కాలనీలో సంచలనంగా రేపింది. మల్లా ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం కొత్తవలసకు చెందిన మల్ల ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కొంతకాలంగా జీవనోపాధి కోసం వలస వచ్చి పెందుర్తిలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ప్రవీణ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, అతని భార్య కాయగూరల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులిద్దరికీ రెండేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. శుక్రవారం రాఖీ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులందరితో రాఖీలు కట్టించుకున్న ప్రవీణ్ కుమార్.. అర్థరాత్రి సమయంలో సెల్‌ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు ‘RIP’ అంటూ సందేశం పంపినట్లు తెలిసింది.
Also Read : బంగారం, వెండి ధరలు ఢమాల్… ఈ రోజు కొన్నవారికి లక్కీ ఛాన్స్..?
ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ ముందుగా తన భార్య, ఇద్దరు కుమార్తెలకు విషం ఇచ్చి అనంతరం తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తల్లి, ఇద్దరు బిడ్డలను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ.అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. రాఖీ పండుగ రోజున కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన ప్రవీణ్ కుటుంబం అనంతరం అకారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలా.. ఆర్థిక ఇబ్బందులు కారణమా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read : IAS ఉద్యోగానికి గుడ్ బై.. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ప్రవీణ్ ప్రకాశ్!









