
BIG BREAKING : శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేయడంతో కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది.
కొత్తూరు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులు గత ఐదు గంటలుగా సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఆయనను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయబోతున్నారనే వార్తలు బయటకు రావడంతో, దువ్వాడ అనుచరులతో పాటు మాధురి భారీ సంఖ్యలో కొత్తూరు పీఎస్‌కు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ గేటు ముందే ప్లకార్డులు పట్టుకుని వారంతా నిరసనకు దిగారు. పోలీసుల ప్రవర్తనపై మాధురి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
మాధురి సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా మాధురి మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో మరే క్రైమ్‌లు, నేరాలు లేవా? పోలీసులకు ఎప్పుడూ మా ఆయనే దొరుకుతాడా? దువ్వాడ శ్రీనివాస్‌కు ఏమైనా అయితే నేను చూస్తూ ఊరుకోను. మా ఆయన్ని ఇంతలా హింసిస్తున్న ఆ నా కొడుకులను అస్సలు వదలను అంటూ ఆమె కామెంట్స్ చేశారు, మా ఆయన చేసింది తప్పు అయితే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసింది కూడా తప్పే కాదా? పవన్ కళ్యాణ్ జగన్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు.. కానీ శ్రీను మాత్రం పవన్‌ను తిట్టకూడదా? ఇది ఏక్కడి న్యాయం అంటూ ఆమె ప్రశ్నించారు. మంత్రి అచ్చన్నాయుడు చేసిన అవినీతి బాగోతాన్ని మేము ధైర్యంగా బయట పెట్టినందుకే కక్ష గట్టి మాకు ఇలా నోటీసులు ఇస్తున్నారు అంటూ మాధురి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జిల్లాలో మరే క్రైమ్ లు లేవా పోలీసులకు మా ఆయనే దొరికాడా..
దువ్వాడ శ్రీనివాస్ కి ఏమైనా అయితే చూస్తూ ఊరుకోను….
మా ఆయన్ని ఇంతలా హింసిస్తున్న ఆ నా కొడుకులను వదలను…
ఎప్పుడో ఫిర్యాదు చేస్తే ఇప్పుడు నోటీసులు ఇస్తా 'రా'..
మా ఆయన చేసింది తప్పు అయితే పవన్ కళ్యాణ్ చేసింది కూడా తప్పు… pic.twitter.com/5cPl04cDoW
— RTV (@RTVnewsnetwork) June 22, 2026









