BIG BREAKING : వైజాగ్ లో ఆదివారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రకంపనల ధాటికి స్థానికులు నిద్రలో నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి, ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నగరంలోని సాగర్ నగర్, తాటిచెట్ల పాలెం, మాధవధార, ఈస్ట్ పాయింట్ కాలనీ, సీతమ్మధార, పెదవాల్తేరు, హెచ్‌బీ కాలనీ వంటి ప్రాంతాల్లో భూమి కంపించినట్లు ప్రజలు స్పష్టంగా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ భూకంపం బంగాళాఖాతంలో భూ ఉపరితలానికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు తెలుస్తోంది. దీని ప్రభావం తీర ప్రాంతమైన విశాఖ నగరంపై పడటంతో ప్రకంపనలు సంభవించాయి.

అదృష్టవశాత్తూ తీవ్రత తక్కువగా ఉండటంతో ఎటువంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం సంభవించలేదు. సముద్ర తీర ప్రాంతం కావడంతో భూమి పొరల్లోని ఫలకాల్లో వచ్చే కదలికల వల్ల ఇలాంటి ప్రకంపనలు అరుదుగా సంభవిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో విశాఖలో ఎప్పుడూ భారీ భూకంపాలు సంభవించిన దాఖలాలు లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు సూచిస్తున్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఇటీవల పెరుగుతున్న భూకంపాల దృష్ట్యా ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అంతా సాధారణంగానే ఉందని, ఎవరూ భయాందోళనలకు గురికావద్దని అధికారులు భరోసా ఇస్తున్నారు.

 

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.