AP Work From Home
AP Work From Home

AP Work From Home: ఏపీలో గురువారం ఉదయం కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారధి వివరించారు. రాష్ట్రంలో వారానికి ఒకరోజు నో వెహికిల్ డే ఉంటుందని తెలిపారు. అలాగే ఆఫీసులో ఉండాల్సిన అవసరం లేని ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ” పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా దేశంపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించాం. ప్రతిఒక్కరు నా దేశం నా బాధ్యత అనే విధంగా వ్యవహరించాలి. దేశంలో అన్ని రాష్ట్రాలు ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. 

Also Read: చెక్కరపై నిషేధం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణం ఇదే?

కొన్నాళ్ల పాటు మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేశాం. రాష్ట్రంలో వారానికి ఒకరోజు నో వెహికిల్ డే ఉంటుంది. మంత్రులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదా ఈవీ, సైకిల్ వినియోగించాలని నిర్ణయించాం. జిల్లా పర్యటనల్లో కాస్ట్ కటింగ్ పాటించాలి. మెజార్టీ మీటింగ్‌ను వర్చువల్‌గా నిర్వహించాలి. ఆఫీసులో ఉండాల్సిన అవసరం లేని ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చులు తగ్గించాలని” నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు.