Bhogapuram Airport : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మెరుగైన విమాన సర్వీసులు అందించేందుకు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది.

భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి ఆగస్టు 17 నుంచి అధికారికంగా విమానాల రాకపోకలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎయిరిండియా సంస్థ అక్టోబర్ 24 వరకు తన తాజా ఫ్లైట్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.

హైదరాబాద్ – భోగాపురం: ఈ రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎయిరిండియా రోజూ ఏకంగా 5 సర్వీసులను నడపనుంది.

బెంగళూరు – భోగాపురం: బెంగళూరు నుంచి భోగాపురానికి రోజూ రెండు రెగ్యులర్ సర్వీసులు ఉండనున్నాయి. దీనికి అదనంగా, ఆదివారం, శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు మరో అదనపు సర్వీసును కూడా అందుబాటులో ఉంచనున్నట్లు సంస్థ తెలిపింది.

Also Read : ఏపీలో మొత్తం ఓటర్లు ఇంతే.. ఎన్ని ఓట్లు పోయాయంటే?

విజయవాడ – భోగాపురం: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతానికి, ఉత్తరాంధ్రకు మధ్య కనెక్టివిటీని పెంచేలా విజయవాడ-భోగాపురం మధ్య రోజూ 4 సర్వీసులను నడపనున్నట్లు ఎయిరిండియా స్పష్టం చేసింది.

ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ సరికొత్త ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటకం, రవాణా రంగాలకు ఎంతో ఊతం లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. విమాన సర్వీసుల షెడ్యూల్ కూడా వెలువడటంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది.

మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1వ తేదీన జరగవలసిన కొన్ని యూజీ, పీజీ , ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలను వర్సిటీ అధికారులు అధికారికంగా వాయిదా వేశారు.

ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ వేడుకలు, వీఐపీల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షల కారణంగా నగరంలో రవాణాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ వాయిదా పడిన పరీక్షలకు సంబంధించిన తదుపరి తేదీలను ఆంధ్ర విశ్వవిద్యాలయం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

Also Read : పవన్ కళ్యాణ్ స్వాగతం పలికిన ‘కుంకీ’ ఏనుగుల అసలు కథేంటి?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.